ఆగట్టి ఐలాండ్ కు సుమారు 75 కి. మీ.ల దూరంలో సుహేలి వలియాకర మరియు సుహేలి చేరియాకర అనే రెండు చిన్న దీవులు కలసి సుహేలి పార్ అనే దీవి సముదాయాన్ని ఏర్పరచాయి. ఈ రెండు దీవుల లోను సముద్ర భాగం పెద్ద కోడి గుడ్డు ఆకారం లో పచ్చటి నీటి తో ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. రెండు దీవులకు మధ్య సుహేలి పిట్టి అనే సన్నటి ఇసుక ప్రదేశం వుంది అది అక్కడి పక్షులకు గుడ్లు పెట్టె ప్రదేశంగా వుంటుంది.
సుహేలి పార్ ప్రదేశం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు టూనా చేప కు ఒక కేంద్రం గా మారి పోతుంది. ఈ సమయం లో ఆగట్టి మరియు ఇరుగు పొరుగు ద్వీపాల నుండి మత్స్యకారులు వచ్చి అక్కడ తాత్కాలిక శిబిరాలు వేసి వ్యాపారం చేస్తారు. ఏ రకమైన అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా, ఒంటరిగా కూర్చుని మధ్యానాలు ఇసుక బీచ్ లో ఆనందించాలంటే ఈ ప్రదేశం బాగుంటుంది. ఆహారాల కొరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకోనవసరం లేదు.