లాటూర్ పర్యాటకులకు దాని వారసత్వం గురించిన అంశాలను ఎన్నింటినో వివరిస్తుంది. లాటూర్ మహారాష్ట్రలో ఆగ్నేయదిశగా ఉంది. మరఠ్వాడా ప్రాంతం క్రిందకు వస్తుంది. ఈ ప్రదేశంలో 7వ శతాబ్దం కు చెందిన అనేక చారిత్రక ప్రదేశాలు నేటికి చక్కని సంరక్షణలో కనపడతాయి. 7వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజుల పాలన నుండి బ్రిటీష్ రాజ్ లోని నిజాం పాలన వరకు అంటే సుమారుగా 1900 సంవత్సరం వరకుగల ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ చూడవచ్చు. లాటూర్ పట్టణం చుట్టు పక్కల ఎన్నో అందమైన ఆకర్షణలు కలవు.
లాటూర్ పట్టణం బాలఘాట్ పీఠభూమిపై సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తున కలదు. శీతాకాలంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మంజర నది లాటూర్ పట్టణం గుండా ప్రవహించి సాయంత్రాలు ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. మంజర నది మాత్రమే కాక, ఇక్కడ టర్న, మన్యద్, లెండి మరియు ఘర్ని నదులు కూడా కలవు. మీకు వర్షాలు ఇష్టమైతే లేదా మీరు మంచి ఫొటోగ్రాఫర్ అయినట్లయితే, లాటూర్ ను వర్షాకాలంలో సందర్శిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రాంతం అంతా వర్షాలతో అందంగా కనపడుతుంది.
వాణిజ్యపర అంశాలునిజాం పాలన కాలం నాటినుండి, లాటూర్ వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. నేటికి లాటూర్ లో అనేక రకాల ధాన్యాలు పండుతాయి. లాటూర్ లో వ్యవసాయ పర్యటన విశేష అంశం. వ్యవసాయం ప్రయోగాత్మకంగా చేస్తారు. లాటూర్ ను అన్ని చోట్లనుండి చేరవచ్చు. ప్రధాన పట్టణాలైన నాందేడ్, పర్భాని లనుండి మరియు మహారాష్ట్రలోని మూల ప్రాంతాలనుండి కూడా తేలికగా చేరవచ్చు.