డ్యూక్ వెల్లింగ్టన్ ముక్కు పేరిట ఏర్పడిన ఈ డ్యూక్స్ నోస్ ఖండాలా లో వున్న కొండ చరియ. మొనతెలినట్టుండే ఈ కొండ పాము తలను పోలి వుండడం వల్ల స్థానికంగా దీన్ని నాగఫణి అని అంటారు (నాగ – పాము, ఫణి – తల) కష్టపడి ఈ కొండ చరియను ఎక్కగలిగితే మీ కష్టం ఫలించి అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతారు.ఇక్కడినుంచి కొండ క్రింది మైదానాలను చూడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.