బర ఇమంబర అంటే పూజించే పెద్ద స్థలం అని అర్ధం. 1783 వ సంవత్సరంలో లక్నో నవాబు అసఫ్-ఉద్-దౌలాహ్ పేరుతొ నిర్మించిన ఈ భవనాన్ని అస్ఫీ ఇమంబర అని కూడా అంటారు. నగరంలోని అత్యంత అద్భుతమైన భవనాలలో ఇమంబర ఒకటి.
ఈ ప్రాంతంలో ఒక మందిరం, భుల్ భులయియన్ – చిక్కుదారి, ఒక గు౦ట లేదా మెట్ల భావి, ఒక పందిరి కింద చనిపోయిన నవాబు సమాధి ఉన్నాయి. ఈ ఇమంబర నిర్మాణ ఆకృతి ప్రపంచంలో ఐదవ పెద్ద మసీదుగా భావించబడే పాకిస్తాన్ లోని లాహోర్ బాద్శాహి మసీదు చే ప్రాతినిధ్యం గావించబడిన మొఘలు శైలితో ఉన్న విలక్షణమైన అలంకరణ. దీనికి ఇనుము కానీ యూరోపియన్ నిర్మాణానికి చెందిన వాటిని ఉపయోగించకపోవడమే దీని అద్భుతమైన రూపకల్పన లక్షణం. ఈ భవనపు మధ్య హాలులో 50x16x15 మీటర్లతో ఉండే పైకప్పుకు ఆధారంగా ఎటువంటి దూలాలు లేవు.
బర ఇమంబర చిక్కుదారులకు, గందరగోళ మార్గాలకు, ప్రతిదీ ఒకదానితో మరొకటి కలిసిఉండే 489 ద్వారబందాలకు పేరుగాంచింది. ఇక్కడనుండి గౌమతి నదికి దారితీసే ఒక మైలు సొరంగం (ఇప్పుడు మూయబడింది) ఉందని నమ్మకం.