ఇది NH-3 నుండి 17 కిమీ దూరంలో ఉన్నది. ఇక్కడ విలక్షణమైన నమూనాలతో మరియు ఆకర్షణీయమైన రంగులతో నూలు చీరలు నేస్తారు. ఈ ప్రదేశం కొనుగోళ్లకు పుట్టినిల్లువంటిది. ఇక్కడి స్థానికుల చేతికళలతో ఈ ప్రదేశం వేగంగా పురోవృద్ధి చెందుతున్నది. పర్యాటకులు, మహేశ్వర్ లోఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసిన తరువాత, చిన్న పట్టణం అయిన కస్రావాద్ స్థానిక సంస్కృతిని ఆనందించటానికి మరియు విశ్రాంతి తీసుకోవటానికి రావొచ్చు.
గంగాలేశ్వర్ ఫర్వత్ మీద ఉన్న బాబా కి మజార్, భవానీ మాత దేవాలయం మరియు పురాతన కైలాష్ కుండ్ మొదలైనవి కస్రావాద్ లో ఉన్న కొన్ని ఆకర్షణలు. ఇక్కడ శీతాకాలంలో జరిగే రంగులతో నిండి ఉన్న గంగాలేశ్వర్ ఉత్సవాలను చూడటానికి ప్రతి సంవత్సరం వందల కొద్ది యాత్రికులు వొస్తుంటారు. ఈ పట్టణం చిన్నది అయినా, ఇక్కడికి పర్యాటకులు విశ్రాంతిగా మరియు ప్రశాంతంగా ఉండటానికి వొస్తుంటారు.