ఉత్తర లఖింపూర్ లో మజులి కి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేతియ గావ్ ఒక పేరొందిన పర్యాటక ప్రాంత౦. మజులి సందర్శించే పర్యాటకులు అస్సాంలో శక్తివంతమైన బ్రహ్మపుత్ర తర్వాత పెద్ద నదులలో ఒకటి సుబన్సిరి అందాలను చూడటానికి చేతియ గావ్ తప్పనిసరిగా వెళ్ళాలి. నదీ వెంబడి కనిపించే వృక్ష, జంతు జాలాలతో ఇది ప్రకృతి ప్రేమికుని స్వర్గంలా ఉంటుంది.
సుబన్సిరి నదీ వేగవంతమైన ప్రవాహాలకు ప్రసిద్ధి, దీని దిగువ ప్రవాహంలో దేశంలోని అతి పెద్ద జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులలో ఒకటి రాబోతుంది. చేతియాగావ్ పర్యాటకులకు దగ్గరలోని అడవులకు, నది ఒడ్డు వెంబడి పర్వతారోహణ వంటి సాహసాలకు అవకాశాన్ని కల్గిస్తుంది. ఈ ప్రాంతం చుట్టూ పర్యాటకులలో ప్రసిద్ధి చెందిన గోగాముఖ్ బోర్దోలోని, ధపలియాగావ్, ధకువాఖాన ఉన్నాయి. ఈ ప్రాంతంలోని హైలైట్ లలో ఒకటి స్థానిక వంటకాలను ప్రయత్నించడం మరవకండి.