Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలప్పురం » వాతావరణం

మలప్పురం వాతావరణం

అత్యుత్తమ కాలం మలప్పురం సందర్శనకు సెప్టెంబర్ (వర్షాలు ముగిసిన వెంటనే) నించి ఫిబ్రవరి (జిల్లాకు వేసవి వేడి తాకక ముందు) అత్యుత్తమ సమయం. ఈ సమయంలోనే జిల్లాలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. పక్షులను చూడాలనుకునేవాళ్ళు ఎండను లక్ష్య పెట్టకుండా వేసవి లోనే వెళ్ళాలి.అయితే విపరీతమైన వేడిమి, భారీ వర్షాలు ఉండే నెలలను నివారించటం ఉత్తమం.

వేసవి

వేసవికాలం మలప్పురం జిల్లా లో వేసవికాలం లో తీవ్రమైన ఉష్ణ వాతావరణం ఉంటుంది. కేరళలో అన్ని ఇతర ప్రాంతాలలో లా మలప్పురం లో వేసవి మార్చ్ నెలలో మొదలయ్యి మే నెల చివరిలో రుతుపవనాల వచ్చే దాకా ఉంటుంది.ఏప్రిల్ - మే నెలలు ఏడాది లో కల్ల అత్యంత వేడైన కాలం. అయితే పక్షులను చూడటానికి ఇదే సరైన సమయం. వేసవి లో పర్యటించాలనుకునేవారు తప్పనిసరిగా నూలు దుస్తులు , చలువ కళ్ళజోడు తీసుకువెళ్ళాలి.

వర్షాకాలం

వర్షాకాలం మలప్పురం లో జూన్ నెల నించి వర్షాలు మొదలవుతాయి. ఈ ప్రాంతం సెప్టెంబర్ దాకా నాలుగు పూర్తి నెలలు భారీ వర్షపాతం నమోదు చేస్తుంది. నైరుతి రుతుపవనాల జూన్ మరియు జూలై లో విస్తారమైన వర్షాలకి కారణం అవుతాయి. ఎడ తెరిపి లేని వానలు ఈ కాలాన్ని సందర్శనకి ప్రతికూలంగా చేస్తాయి . అక్టోబర్ మరియు నవంబర్ నెలల సమయంలో కూడా వాయువ్య రుతుపవనాల వల్ల తగు మోతాదు లో వర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం కేరళలోని ఇతర జిల్లాల లాగా మలప్పురం శీతాకాలం మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. జనవరి నెలలో మొదలయ్యే చలికాలం ఫిబ్రవరి నెల దాకా కొనసాగుతుంది. ఈ ప్రాంతపు పట్టణాలని కాలిబాటన చూడటానికి , బాహ్య కార్యకలాపాలకి అనువైన సమయం ఇది .