Search
  • Follow NativePlanet
Share

మనాలి - సుందరమైన ప్రకృతి!

71

సముద్రమట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో నే ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి. కులూ జిల్లాలో భాగమైన మనాలి, రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది. సృష్టి కర్త బ్రహ్మ దేవుడిచేత నియమింపబడిన ధర్మ శాస్త్ర విధాయకుడు పేరు మను. ఆ పేరు నుండి ఈ ప్రాంతానికి మనాలి అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. సృష్టి మరియు నాశనం యొక్క ఏడు చక్రాలు పూర్తయిన తరువాత ఈ ప్రాంతానికి మను విచ్చేసాడని నమ్ముతారు. హిందూ మతానికి సంబంధించిన సప్త ఋషులు తల క్రిందులుగా తపస్సు చేసే ప్రాంతంగా మనాలి ప్రసిద్ది.

సుందరమైన ప్రకృతికి, పూల వనాలకి, మంచుతో కప్పబడిన పర్వతలకి, అలాగే ఎరుపు మరియు ఆకుపచ్చని ఆపిల్ తోటలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. గ్రీన్ హిమాలయన్ నేషనల్ పార్క్, హదింబ టెంపుల్ సోలంగ్ వాలీ మరియు బీయస్ కుండ్ సరస్సు మరియు రోహతంగ్ పాస్ ల ను మనాలీ కి సందర్శనకు వచ్చిన పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలు. ఇవే కాకుండా పండా డ్యాం, చంద్రఖాని పాస్, రఘునాథ్ టెంపుల్ మరియు జగన్నాథి దేవి టెంపుల్ వంటి మరికొన్ని ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని ప్రధాన ఆకర్షణలు.

క్రీ.శ. 1533 లో నిర్మించబడిన హడింబ టెంపుల్, హిందువుల పురాణాలలో రాక్షసి హడింబి కి చెల్లి హదింబా దేవి కి ఈ ఆలయం అంకితమివ్వబడింది. స్థానికుల నమ్మకాల ప్రకారం, ఇలాంటి ఆలయం వేరే ఎక్కడా నిర్మాణం కాకూడదని ఈ ఆలయం నిర్మాణం చేయించిన రాజు ఈ నిర్మాణం లో పాలుపంచుకున్న కళాకారుల కుడి చేతిని నరికించాడని అంటారు.

300 మీటర్ల ఎత్తులో ఉన్న సోలాంగ్ లోయ ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ నిర్వహించబడే వార్షిక శీతాకాల స్కయింగ్ ఫెస్టివల్ ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం లో ఉన్న ఘనమైన పర్వతం బాట అయిన రోహతంగ్ పాస్ సందర్శకులలో పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ది చెందింది. అంతే కాకుండా, పారాగ్లైడింగ్, మౌంటైన్ బైకింగ్ మరియు స్కయింగ్ వంటి కార్యక్రమాలకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెందడం వాళ్ళ

సోలంగ్ లోయ , మనాలి లో ఉన్న మరొక ప్రఖ్యాత పర్యాటక స్థలం , ఇది 300 మీటర్ ల ఎత్తు హై స్కి లిఫ్ట్ కు పెరుగడించింది. ప్రతి ఏడాది జరిగే వింటర్ స్కీయింగ్ ఫెస్టివల్ విశేషం గా పర్యాటకులని ఆకర్షిన్స్తుంది.జీప్ తో వెళ్ళగల ఎత్తిన రోడ్ మార్గం గాను ఈ ఉన్నతమైన పర్వతం పర్యాటకుల పిక్నిక్ స్పాట్ గాను ప్రసిద్ది. పారా గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్, స్కీయింగ్ మొదలగు క్రీడలలో పాల్గొనవచ్చు. అందమైన ప్రక్రుతి దృశ్యాలు,పర్వాతలు,గ్లేసియర్ లు కల రోహతంగ్ పాస్ పర్యటన పర్యాటకులకు అధ్బుతమైన అనుభూతిని పంచుతుంది.

మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు స్నానానికి ఉపయోగించాడని చెప్పబడే బిస్ కుండ్ ఇక్కడ ఉంది. ఇందులో ఒక్క సరి మునిగితే అన్ని చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడి వారి నమ్మకం.

ఇక్కడ ఉన్న వసిష్టుని గ్రామం మరొక ఆకర్షణ. సాండ్ స్టోన్ దేవాలయాలు, సహజ తటాకాలు ఇక్కడి విశేషాలు.

భగవంతుడు రాముని తమ్ముడు అయిన లక్ష్మణుడు ఇక్కడ వేడి సల్ఫర్ తటాకాలని సృష్టించాడని స్థానిక ఇతిహాసం. ఇక్కడి కాలా గురు మరియు రామ మందిరం ఇతర విశేషాలు.

వన్య మృగాలని చూడాలనుకునేవారు ఇక్కడి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ని సందర్శించవచ్చు. ఈ ప్రదేశం అంతరిస్తున్న పక్షి జాతులకు నెలవు, వెష్టర్న్ త్రాగోపాన్ , మరియు 300 ఇతర పక్షి జాతులు , 30 రకాల క్షిరదాలను చూడవచ్చు.

1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన జగన్నాథి దేవాలయం మనాలి లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం లో భువనేశ్వరి ని పుజిస్తారు.భువనేస్వారిని భగవంతుడు విష్ణువు యొక్క చెల్లెలు గా భక్తులు విశ్వసిస్తారు. రఘునాథ దేవాలయం ఇక్కడి మరొక తప్పక చూడతగ్గ ఆధ్యాత్మిక కేంద్రం.రఘునాథ జి కి అంకితం ఇవ్వబడిన ఈ దేవాలయం హిమాలయల లోని ఒక సముహమయిన పహరి, మరియు పిరమిడ్ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

పారా గ్లైడింగ్, జోర్బింగ్, ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్ , మౌంటెన్ బైకింగ్ , పర్వతారోహణ వంటి సాహసోపేతమైన క్రీడలకి పీరు గడించింది ఈ మనాలి.డియో తిబ్బ బేస్ క్యాంపు , పిన్ పార్వతి పాస్ , బిస్ కుండ్, SAR పాస్ , చంద్రఖని, బ్రచైల్ , బాల్ తాల్ లేక్ మొదలగు ప్రఖ్యాత ట్రెక్కింగ్ దారులు.

మౌంటెన్ బైకింగ్ లో ఆసక్తి కల పర్యాటకులకు హతంగ్ పాస్ , లడఖ్ మరియు లహౌల్ స్పిటి అఫ్ మనాలి వంటివి పుష్కలమైన అవకాశాలు కలిగిస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు మౌంటెన్ రోడ్లు మంచు లేకుండా స్పష్టంగా ఉండడం వల్ల ఈ సమయం మౌంటెన్ బైకింగ్ కి అనువైన సమయం.

వాయు, రైలు, మరియు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులు మనాలి కి సులభం గా చేరుకోగలరు. మనాలి నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుంతర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న స్వదేశి విమానాశ్రయం. న్యూ ఢిల్లీ, చండీగర్, ధర్మశాల, షిమ్లా మరియు పతంకోట్ వంటి ప్రముఖమైన భారతీయ నగరాలకు ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, విదేశీ పర్యాటకులని మనాలి చేరుకునేందుకు తోడ్పడుతుంది.

మనాలి నుండి 165 కిలోమీటర్ల దూరం లో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇండియా నుండి చండీగర్ చేరే ప్రాంతం లో వివిధ ప్రాంతాలకి అనుసంధానమై ఉంది. చండీగర్, షిమ్లా, న్యూ ఢిల్లీ మరియు పతంకోట్ పట్టణాలకు హిమాచల్ ప్రదేశ్ టూరిసం డెవలప్మెంట్ కార్పొరేషన్ (HPTDC) బస్సులు తరచూ సేవలు అందిస్తూ ఉంటాయి.

ఏడాది పొడవునా మనాలి లో ని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ, మార్చ్ నుండి జూన్ మాసాలు మనాలి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం గా పరిగణించవచ్చు.

మనాలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మనాలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మనాలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మనాలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(HPTC) బస్సు సర్వీసుల ద్వారా కులూ ప్రధాన భారతీయ పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉంది. న్యూ ఢిల్లీ, చండిగర్, పతంకోట్, మరియు షిమ్లా నుండి డీలక్స్ బస్సు సేవలు పర్యాటకులు ఉపయోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : మనాలి నుండి165 కిలో మీటర్ల దూరం లో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ మనాలి కి సమిపం లో ఉన్న రైల్వే స్టేషన్. ప్రధాన భారతీయ పట్టణాలకి చండిగర్ మీదుగా చక్కగా అనుసంధానమై ఉంది. మనాలి నుండి ఈ రైల్వే స్టేషన్ 310 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి మనాలి చేరుకునేందుకు పర్యాటకులకు టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : కులూ మనాలి విమానాశ్రయం లేదా భుంతర్ విమానాశ్రయం లేదా కులూ విమానాశ్రయం, మనాలి నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న స్వదేశి విమానాశ్రయం. భారత దేశం లో ని ప్రధాన నగరాలైన న్యూ ఢిల్లీ, పతంకోట్, ధర్మశాల, షిమ్లా, చండిగర్ వంటి పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI) ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat