ఝాతిన్గ్రి , సముద్రమట్టానికి 6600 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం ఒక ప్రఖాత పిక్నిక్ స్పాట్. మండి -పతంకోట్ నేషనల్ హైవే లోని ఉర్ల ద్వారా ఈ ఘోగర్ డ్యాం వద్ద ఉన్నటువంటి ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఝాతిన్గ్రి కి చేరే మార్గం లో ని పైన్ మరియు దేవదారు అడవులు మరింత అందాలను ఈ మార్గానికి చేకూరుస్తాయి. ఈ ప్రదేశం లో పర్యాటకులు మండి యొక్క పురాతన వేసవి పాలసు మరియు రెస్ట్ హౌస్ ను చూడవచ్చు.