తన్నీర్ భావి బీచ్, పనంబూర్ ప్రాంతంలో మంగుళూర్ కు ఉత్తర దిశగా 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ బీచ్ ఒక నదివలే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సముద్రపు అలలు చక్కటి ధ్వనులు కలిగిస్తూంటాయి. ఇక్కడినుండి మంగుళూరుకు ఎన్నో ప్రభుత్వ బస్ లు నడుస్తూంటాయి. బీచ్ లో అతి తక్కువ సందడి ఉంటుంది. ఒంటరిగానైనా సరే ఆనందించవచ్చు. గుంపులు లేని ప్రదేశాలను ఆనందించాలననుకునేవారికి ఇది చాలా బాగుంటుంది. సహజ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది ఒక మంచి పర్యాటక స్ధలం.బీచ్ కు ఆవలివైపున నాఫ్తా పేలుడు ప్రదేశం ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే రోడ్డు లేదా ఫెర్రీ మార్గాలు ఉపయోగించవచ్చు. ఫెర్రీ మీద వెళ్ళాలంటే, సుల్తాన్ బేటరీ నుండి గురుపుర నదిపై ప్రయాణించాలి. ప్రభుత్వ గుర్తింపులేని ఈ బీచ్ లో లైఫ్ గార్డ్ వ్యవస్ధ లేనందున ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. కనుక మీరు జాగ్రత్తలతో సురక్షితంగా ఇక్కడ ఆనందించాలి.