అలప్పూజ పట్టణానికి 22 కి.మీ.ల దూరంలో కల అర్ధుంకాల్ గ్రామంలో ఈ చర్చి కలదు. ఈ ప్రదేశం హిందువులకు మరియు క్రిస్టియన్లకు కూడా పుణ్య క్షేత్రంగా ఉంటుంది. అర్ధుంకాల్ ని మొదటలో అర్ధున్ కలగ్రా అనేవారు. తర్వాతి కాలంలో అర్ధుంకాల్ గా మారింది. ఇక్కడి చర్చిని అర్ధుంకాల్ సెయింట్ ఫోరేన్స్ చర్చి అంటారు. దీనిని పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో నిర్మించారు.
ఈ చర్చిని 1638 సంవత్సరంలో మరో మారు వికార్ ఫాదర్ జకోమా ఫెనీషియో అనే మహిమకల ఫాదర్ జ్ఞాపకార్ధం పునరుద్ధరించారు. 1647 సంవత్సరంలో మిలన్ లో తయారు చేయించిన సెయింట్ సెబాస్టియన్ విగ్రహాన్ని ఈ చర్చిలో ప్రతిష్టించారు. అలెప్పీలో బేసిలికా హోదా ఇవ్వబడిన పర్శీలలో అర్ధుంకాల్ సెయింటో్ ఫోరేన్ చర్చి మొదటిది. అలెప్పీ డయోసీజ్ లో ఈ చర్చి మొదటిది. రాష్ట్రంలో ఇది ఏడవ బేసిలికా మరియు కేరళలో మూడవ లాటిన్ కేధలిక్ చర్చి.