కావేరి నది ఉత్తర తీరాన వున్న వదాన్యేశ్వర్ దేవాలయాన్ని వల్లలార్ కోయిల్ అని కూడా అంటారు. ఇక్కడి శివాలయానికి ఒక పురాణ గాథ వుంది. ఆ కథ ప్రకారం శివుడిని మోస్తున్నది తనే ననే అహంకారం నందీశ్వరుడికి ఎక్కువైందని శివుడు బాధ పడ్డాడు. అందువల్ల తన జటాజూటాల్లో ఒక దానిని బాగా బరువెక్కించి దాన్ని కూడా నంది మోయలేకకుండా చేయడం ద్వారా అతనికి సౌశీల్యం నేర్పాలని శివుడు తలపోశాడు.
ఇక్కడి విగ్రహం నందీశ్వరుడి మీద యోగ ముద్ర లో ఎక్కి కూర్చున్న శ్రీ మేధా దక్షిణామూర్తి గా దర్శనమిస్తుంది. ఆయన కుడి చేతిలో జ్ఞాన ముద్ర వుండగా, ఎడమ చేతిలో పుస్తకం వుంటుంది. ఈ గుడి చరిత్ర మాత్రమె కాక ఈ పరిసరాల అందం కూడా యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇక్కడి వృషభ మంటపంలో శీ వల్లలార్ (అనంతంగా ఇచ్చేవాడు అని అర్ధం) అనబడే వదాన్యేశ్వరుడి విగ్రహం తో పాటు జ్ఞానా౦బికా దేవి విగ్రహం కూడా వుంది. ఇక్కడి నుంచి పారుతూ కనపడే కావేరి నాడే దృశ్యం పర్యాటకులు ప్రకృతి ని గౌరవి౦చేలా చేస్తుంది.