Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మెదక్ » వాతావరణం

మెదక్ వాతావరణం

ఉత్తమ కాలం మెదక్ సందర్శనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు ఉత్తమమైనవి. ఉష్ణోగ్రతలు తగ్గి వేసవి ఉక్క పోత నుండి ఉపసమనం కలుగుతుంది. వాతావరణం ఇక ఏ మాత్రం ఉక్కగా ఉండక మొత్తం రోజంతా చల్లటి గాలులు ఉంటాయి. అయితే డిసెంబర్, జనవరి నెలలలో ఉన్ని తరహ దుస్తులను తీసుకొని వెళ్ళడం ఉత్తమం.

వేసవి

వేసవి మార్చ్ లో మొదలయ్యే వేసవి మే నెల చివరి వరకు ఉంటుంది. వేసవిలో వాతావరణం వేడిగా పొడిగా ఉండి, గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గా నమోదౌతుంది. చాల అలసటకు గురై, శరీరంలో తేమని కూడా కోల్పోయే ప్రమాదమున్నందున వేసవి కాలంలో ఈ ప్రాంత సందర్శన సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షా కాలం ఈ ప్రాంతం లో నైరుతి ఋతుపవనాల వలన వర్షం కురుస్తుంది. జూన్ నెలలో ప్రారంభమయ్యే వర్షాలు సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. ఈ ప్రాంతంలో పవనాల మీద ఆధారపడి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాకాలం లో ఉష్ణోగ్రత తగ్గి దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదౌతుంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలలో కొద్ది పాటి జల్లులు కూడా కురుస్తాయి

చలికాలం

శీతాకాలం సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నెలలలో శీతాకాలం ఉన్నప్పటికీ డిసెంబర్, జనవరి నెలలలో చాల చల్లగా ఉంటుంది. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు 25 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీలుగా నమోదౌతుంది. శీతాకాలంలో సూర్యుడు వేడిగా ఉండడు, సాయంత్రాలు, రాత్రుళ్ళు చల్లగా కాక చాల ఆహ్లాదకరంగా ఉంటాయి.