ముక్తేశ్వర్టెం టెంపుల్కి సమీపం లో ఉన్న చౌతి జాలి లేదా చౌలి కి జాలి ఈ ప్రాంతం లో ఉన్న ప్రసిద్దమైన పర్యాటక కేంద్రం. కొండపై ఉన్న ఈ ప్రాంతం నుండి కుమన్ వాలీ మరియు హిమాలయన్ శ్రేణుల యొక్క అందాలను తిలకించవచ్చు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం పైనే రాక్షస మరియు దేవతల పోరు సాగింది. వాటికి సాక్ష్యం గా లోహపు పలక, ఏనుగు మొండెం మరియు కత్తి యొక్క సరిహద్దు రేఖలు ఇక్కడ ఇప్పటికీ గమనించవచ్చు.
ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్న రాతికి కూడా ఒక విశేషం ఉంది. ఇక్కడున్న అల్లిక తడక లోంచి గొడ్రాలు స్త్రీ తల బయటికి తీసుకుని వస్తే పిల్లలు కలుగుతారని నమ్ముతారు. కైలాష్-మానస సరోవర్ యాత్రకి వెళ్ళే దారిలో పెద్ద రాయి అడ్డం గా రావటం వలన ఈ ప్రాంతం లో చిక్కుకుపోయిన కొంత మంది భక్తులు శివ నామం జపించగా ఆ రాతిని నాలుగు సార్లు తట్టమని భగవంతుడు అందులోని గురువుని ఆజ్ఞాపిస్తాడు. నాలుగో సారి ఆ రాతిని తట్టగా ఒక సన్నటి మార్గం ఆ రాతిలో కనపడుతుంది.