సముద్ర మట్టం నుండి 1940 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన కుగ్రామం నటుకన్. ముక్తేస్వర్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. నాతు ఖాన్ అనబడే ప్రసిద్దమైన ఇస్లాం వ్యక్తి పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. తల్లతండ, నవాడ, మల్లతండ, గావున్, కఫల్ధరి, కానాల, ఝోప్రో, బనొల, బంగా, బగీచా, లమఖాన్ మరియు తపుక్ లానే వివిధ చిన్న ప్రాంతాలుగా ఈ గ్రామం విభజించబడింది.
అద్భుతమైన హిమాలయన్ పర్వత శ్రేణుల అందాలను ఈ ప్రాంతం నుండి వీక్షించే అవకాసం పర్యాటకులకి లభిస్తుంది. ఓక్, పైన్, బిర్చ్ కఫల్ వృక్షాలు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణని జోడిస్తాయి. ట్రెక్కింగ్ మరియు నేచర్ వాక్స్ ఇక్కడి పర్యాటకులలో ప్రసిద్ది చెందిన ఆక్టివిటీ లు.