Search
  • Follow NativePlanet
Share

ముంబై - నగర వింతలు...విశేషాలు !

84

ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల వలే ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి.

ముంబై నగరం దేశంలోని వివిధ ప్రాంతాలకు రోడ్డు, రైలు, సముద్రం మరియు విమాన మార్గాలద్వారా కలుపబడి ఉంది. మీరు ముంబై నగరం చేరుకోగానే ఆ నగర వేష భాషలు దేశంలోని ఇతర ప్రాంతాలకంటే విభిన్నంగా ఉండటాన్ని గమనిస్తారు. ప్రతి ఒక్కరూ ఎంతో స్నేహ పూరితంగా ఉంటారు. ఒక రకమైన క్రమశిక్షణ ప్రతి అంశంలోను అంటే జనసమ్మర్ద వీధులలో టాక్సీలు సంచరించడం దగ్గరనుండి విమానాశ్రయాలలో విమానాలు విహరించటం వరకు ఎంతో పద్ధతిగా సాగిపోతూంటుంది. ముంబైనగరం ఇంతవరకు భారత దేశంలో ఒక విశిష్ట పర్యాటక ప్రదేశంగా పర్యాటకులచే గుర్తించబడుతోంది.

ముంబై ఒక కలగూర గంప

ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి. తినే ఆహారాలు, షాపింగ్ నుండి సైట్ సీయింగ్ నుండి ఎంతో ఘనంగా చెప్పుకునే రాత్రి జీవిత విధానాలవరకు మీకు ఈ నగరం అందిస్తుంది. నగరం అందించే అనేక ప్రసిద్ధ బ్రాండు వస్తువులే కాక మీరు ఫ్యాషన్ స్ట్రీట్ లోను మరియు బంద్రాలోని లింకింగ్ రోడ్ లోను రోడ్ సైడ్ షాపింగులు చేసి ఆనందించవచ్చు. ఎండవేళ మధ్యాహ్నాలు బీచ్ లలో ఆనందించవచ్చు. పిక్ నిక్ లు పెట్టుకోవచ్చు. బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు, కుల్ఫి, ఫలూదా, పానీ పూరి లేదా మహారాష్ట్ర స్వంత వంటకం వడా పావు వంటివి వివిధ రకాలుగా తినవచ్చు. ముంబైలో మొత్తంగా 3 ప్రధాన బీచ్ లు కలవు. జుహూ బీచ్, చౌపట్టీ మరియు గొరాయ్. ప్రకృతి అంటే ఇష్టపడేవారికి అధిక జనాలు ఇష్టపడని వారికి గోరాయ్ బీచ్ మంచి ఆనందం ఇస్తుంది.

మీ వద్ద కనుక ఒక స్వంత రవాణా వాహనం, కారు లేదా స్కూటర్ వంటివి ఉన్నంతవరకు ముంబై నగరాన్ని ఎంతో సౌకర్యంగా చుట్టిరావచ్చు. ముంబై లో మధ్యాహ్నాలు చాలా వేడి గా ఉండి కొన్ని మార్లు తప్పక వాహనాలు ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటపుడు తేలికగా మరియు చవకగా దొరికే డబుల్ డెక్కర్ బెస్ట్ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి దక్షిణ ముంబై ప్రదేశాలలో ప్రత్యేకించి మెరైన్ డ్రైవ్ లేదా క్వీనన్స్ నెక్లెస్ లలో తిరుగుతూంటాయి.

మీరు కనుక కొద్దిపాటి ధైర్యస్తులైతే, ముంబై లోకల్ ట్రైన్ లోకి ప్రవేశించండి. ఇది చాలా వేగంగా మిమ్మల్ని నగరంలో తిప్పుతుంది. వెస్ట్రన్ మరియు సెంట్రల్ లైన్స్ లో రైళ్ళు చర్చిగేట్ మరియు విటి స్టేషన్లనుండి ఒకదాని వెంట మరొకటి కొద్ది నిమిషాల తేడాతో బయలుదేరుతాయి.

మాల్స్ మరియు మందిరాలు

గత దశాబ్ద కాలంగో ముంబైలో మాల్స్ లో కొనుగోలు చేసే విధానం ప్రజలలో పెరిగిపోతోంది. నేడు ముంబై దేశంలోనే గొప్ప మాల్స్ కలవని ఘనంగా చెనప్పుకునే దశకు చేరింది. తాజాగా ఇటీవలే స్ధాపించిన మాల్ పల్లాడియం. ఇది పొవాయ్ హౌస్ లో ఫొయనిక్స్ మిల్స్ వద్ద కలదు. దీనిలో ప్రసిద్ధ బ్రాండ్లు, గుక్కి, వెర్సాక్, బర్బెర్రీ వంటి బ్రాండ్ల దుస్తులు కొనుగోలు చేయవచ్చు. పల్లాడియం మాల్ లో పేరొందిన రెస్టరెంట్లు అంటే కాలిఫోర్నియా పిజ్జా వంటివి కూడా ఉండి మీకు రుచికల ఆహారాలు అందిస్తాయి.

మతపర విషయాలపట్ల ఆసక్తి కలవారికి, ముంబై లో దేశంలోనే పవిత్రమైన పుణ్య క్షేత్రాలు కలవు. గణేశ భగవానుడు కల సిద్ధి వినాయక దేవాలయం, హాజీ ఆలీ మసీదు వంటి పవిత్ర ప్రదేశాలు ఆధ్యాత్మికులు మరువలేని అనుభవాలు అందిస్తాయి. వీటి కళా నైపుణ్యం మీరు చూస్తే తప్పక ప్రశంసిస్తారు. రెండూ కూడా ఒక దానిని మరొకటి పోలి ఉంటాయి. ఈ ప్రదేశాలు విపరీతమైన రద్దీగా ఉండటం చేత, కొత్తగా సందర్శించేవారు వారి వారి సంబంధిత వ్యక్తులపట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఒక మంచి గైడ్ లేదా తెలిసిన బంధువులతో పర్యటించటం మంచిది. మీరి వీటిని ఏ సమయంలో సందర్శించాలి. అభ్యంతరం లేకపోతే కనుక సిద్ధి వినాయక దేవాలయాలను రద్దీ కారణంగా మంగళవారాలలోను, గురువారాలలోను దర్శించకుండా ఉండటం మంచిది.

రాత్రి నగర జీవితం ఎలాగుంటుంది?

ముంబై నగర రాత్రి జీవితం గురించి దేశ వ్యాప్తంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, ముంబై లో రాత్రి సంచారం ప్రపంచంలోనే అత్యంత భధ్రతకలదిగా చెప్పవచ్చు. ఎన్నో సురక్షితమైన నైట్ క్లబ్బులు మీకు అందుబాటులో ఉంటాయి. పాలీస్టర్స్, టోట్స్, ది ఎల్ బో రూమ్ మరియు 21 డిగ్రీస్ ఫారెన్ హీట్ వంటివి కొన్ని ఎంపిక చేయదగినవి.

ముంబై రాత్రి జీవితం ఆయా ప్రదేశాలను బట్టి అది క్టబ్ అయినా సరే లేక హోటల్ అయినా సరే సుమారుగా ఉదయం 1 గంట నుండి 3 గంటల మధ్య ముగుస్తుంది. ఆ సమయానికి కూడా మీ పార్టీ ముగియకపోతే, మీరు వెంటనే కొలబా లోని బడే మియాస్ కు వెళ్ళి రుమాలి రోటి తిని ఆనందించేయవచ్చు. బడే మియాస్ కు వెళ్ళకుండా మీ ముంబై నగర జీవితం ఆనందించినట్లే కాదు. ముంబై నైట్ సీన్ కు ఇటీవలే మరొక ప్రదేశం ఫోర్ సీజన్స్ వారి ఐస్ బార్ చేరింది. ఇది ఒక రూఫ్ టాప్ ప్రదేశం. 34వ అంతస్తులో కలదు. ఇక్కడినుండి నగరాన్ని రాత్రి వేళ వెలుగులలోచూసి ఆనందించవచ్చు.

అద్దెకారులో ముంబై నగరం చుట్టిరావాలనుకునేవారికి టూర్ బస్ లు ఉంటాయి. వాటిని ముంబై దర్శన్ బస్సులంటారు. అవి సాధారణంగా గేట్ వే ఆఫ్ ఇండియా నుండి బయలు దేరుతాయి. మీకు నగరంలోని ప్రధాన ఆకర్షణలు చూపించి తిరిగి సాయంత్రానికి తీసుకు వస్తాయి.

మొత్తంగా చెప్పాలంటే, ముంబై నగరంలో అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచులవారికి తగినంత ఆనందం లభిస్తూనే ఉంటుంది. మీరు వ్యయం చేసే మొత్తాలను బట్టి మీరు పొందే సేవలు, వస్తువుల నాణ్యత ఉంటుంది. ఎంత తక్కువ సమయం అయినా సరే మీరు నగరాన్ని చూచి ఆనందించవచ్చు. నగరంలో పర్యటించటం చవక మరియు సౌకర్యం ప్రతి ప్రదేశంలోను మీకు మంచి ఆనందం దొరుకుతుంది.

ముంబై ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముంబై వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముంబై

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముంబై

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ముంబై ఉత్తర భారత దేశానికి ఆగ్రా రోడ్డులో కలుపబడి ఉంది. దీనినే ఎల్ బి ఎస్ మార్గం అని అంటారు. ఇది వివిధ రాష్ట్రాలగుండా ప్రయాణించి నేరుగా ఆగ్రా చేరుస్తుంది. తూర్పు మరియు పడమటి ఎక్స్ ప్రెస్ హై వేలు ఈ శాన్యంలో ఇండోర్ కు ఉత్తరాన అహ్మదాబాద్ కు వరుసగా కలుపబడి ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ వే మీదుగా పూనే నగరానికి సరిగ్గా గంటన్నరలో చేరుకోవచ్చు. ఈ నగరాన్ని గోవానుండి జాతీయ రహదారి 7 ద్వారా కూడా చేరవచ్చు. సుమారు 9 గంటల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ముంబై నగరం చేరాలంటే చాలామంది రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ముంబై కి రెండు ప్రధాన లైన్లు కలవు. అవి ఉత్తర మరియు తూర్పులకు అనుసంధానం చేస్తాయి. అంటే అవి వెస్ట్రన్ మరియు సెంట్రల్ లైన్స్ . ప్రధాన జంక్షన్లు మరియు టర్మినస్ స్టేషన్లు చక్కని ఆహార మరియు విశ్రాంతి సౌకర్యాలు కలిగి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఇటీవలి కాలంలో ముంబై లో స్ధానిక విమానాలు ఉదయం 5 గం.లనుండి మరల తెల్లవారు ఝామున రెండు గంటలవరకు కూడా సేవలనందిస్తున్నాయి.. అంటే ఈ సర్వీసులు 24 గంటలూ లబ్యంగా ఉన్నాయని చెప్పవచ్చు. స్ధానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలు, అడ్వాన్స్డ్ పాసెంజర్ విధానం మరియు తగిన విశ్రాంతి గదులు వంటివి తగినన్ని కలిగి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun