x
Want to share your reaction with friends?
బ్యాండ్ స్టాండ్, ముంబై
సిఫార్సు చేసినది
Image source:Wikipedia
బ్యాండ్ స్టాండ్ ముంబై కి మరో సముద్ర ముందు భాగం. ఈ ప్రదేశంలో విలాసవంతమైన కాఫీ హౌస్ లు, రెస్టరెంట్లు, చక్కటి వీధి దీపాలు, సాంప్రదాయ ముంబై చాయ్ వంటివి ఎన్నో ఉంటాయి. బ్యాండ్ స్టాండ్ నుండి కిందకు నడుచుకుంటూ వెళితే, బాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీల, నటుల నివాసాలు కనపడతాయి. షా రుఖ్ ఖాన్ నివాసం మన్నత్, సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ టవర్ వద్ద చూడవచ్చు.
బ్యాండ్ స్టాండ్ ను ముంబై లో లవర్స్ పాయింట్ అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ అనేకమంది స్కూలు మరియు కాలేజీ విద్యార్ధులు తమ తరగతులను ఎగవేసి ముంబై అందాలను ఇక్కడ కూర్చొని తెగ ఆనందించేస్తారు.
Read in English: Bandstand, Mumbai
Click here to type in telugu



