భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో పుడతాయనుకుంటే, వీధి కొనుగోలు ముంబైలో మొట్టమొదట ఎక్కడ మొదలవుతాయంటే కాజ్ వే లో అని చెప్పాలి. ఈ ప్రాంతంలో చాలావరకు వీధులలోనే కొనుగోళ్ళు చేస్తారు. ప్రసిద్ధ బ్రాండ్ వస్తువులు అమ్మేషో రూమ్ వారు వారికి వ్యాపారాలు లేక చాలా నష్టపోతుంటారు.
కాజ్ వే, పేరొందిన ప్రదేశాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, విక్టోరియా టర్మినస్, రీగల్ సినిమా, లియోపోల్డ్ కేఫ్ వంటి వాటికి సమీపంలో కలదు. కాజ్ వే అనుభవాలు పొందాలంటే, మీరు కాలినడకన అక్కడ తిరగాలి. అమ్మాయిలకు ప్రత్యేకించి అనేక ఫ్యాషన్ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ముంబై లోని ప్రధాన సూపర్ స్టోర్సులు కూడా వారి వస్తువులను కాజ్ వే నుండి పొందుతారని కూడా పుకార్లుగా చెపుతారు. కనుక మీరు సూపర్ స్టోర్స్ లలో అధిక ధరలు కూడా పెట్టాల్సిన పని లేదు.