పల్లివాసల్ జలపాతాలు చిన్నవి అయినప్పటికి దేవికులంలో ప్రసిద్ధి చెందినవి. మున్నార్ పట్టణం నుండి 8 కి.మీ.ల దూరంలో కలవు. సీతా దేవి సరస్సు సమీపంలో ఉన్న ఈ జలపాతాలు, దేవికులంలో మరొక ఆకర్షణ. నగర బిజీ జీవనాలతో విసుగు చెందిన వారు ఈ ప్రదేశానికి వచ్చి చక్కని అనుభూతులు పొందవచ్చు. పల్లివాసల్ ఇడుక్కి జిల్లాలో ఒక గ్రామం. ఈ ప్రదేశం కేరళలోని మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా దేశంలో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి మున్నారు నుండి తేలికగా చేరవచ్చు. చుట్టు పక్కల అనేక ఆకర్షణలు కలవు. సీతాదేవి సరస్సు మరియు పల్లివాసల్ జలపాతాలు రెండూ కలిపి చూడవచ్చు.