Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మున్నార్ » వాతావరణం

మున్నార్ వాతావరణం

ఉత్తమ సీజన్ మున్నార్ లో సంవత్సరం పొడవునా కొనసాగే ఒక మోస్తరు వాతావరణం పర్యాటకులను ఏ సమయంలో అయినా సరే దర్శించేదిగా చేస్తుంది. వేసవిలో సైట్ సీయింగ్ అనుకూలం. అయితే, వింటర్ లో వివిధ రకాల సాహస క్రీడలు, ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్ వంటివి కూడా చేయవచ్చు. వర్షాకాలం వెళ్ళటం శ్రేయస్కరం కాదు. వర్షాల కారణంగా మీ పర్యటనకు ఆటంకం కలగవచ్చు.

వేసవి

వేసవి మున్నార్ లో వేసవి, ఒక మోస్తరు, ఆహ్లాదం. వేసవి కాలం మార్చి నుండి మొదలై మే నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 35 డిగ్రీలనుండి కనిష్టం 19 డిగ్రీ సెల్షియస్ గా ఉంటాయి. పగటిపూట ఒక మోస్తరు వేడి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఈ ప్రాంతంలోని తేయాకు తోటలు దర్శించాలంటే, వేసవి అనుకూల సమయం.  

వర్షాకాలం

వర్షాకాలం దట్టమైన అడవుల సమీపంలో ఉండటం చేత మున్నార్ లో అధిక వర్షపాతం నమోదవుతుంది. వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ కాలంలో బయటి ప్రయాణాలు అనుకూలం కాదు కనుక, పర్యటన సూచించదగినది కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో చల్లగా ఉండి ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీల వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్ మరియు ఇతర పర్యాటక చర్యలు చేయవచ్చు. మున్నార్ ఈ సమయంలో సందర్శించేవారు ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.