బెనోగ్ వైల్డ్ లైఫ్ సంక్చురి దట్టమైన అడవుల మధ్యన చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల మధ్యన కలదు. ఈ సంక్చురి నుండి అందమైన చౌఖంబ , బందర్ పంచ్ అనే శిఖరాలు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడ కనుమరుగవుతున్న అరుదైన పక్షులు ఉండేవి. ఇపుడు దీనిని ఒక బర్డ్ వాచింగ్ ప్రదేశంగా అభివృద్ధి చేసారు. ఇక్కడ వృక్ష సంపదే కాక, పులులు, లేళ్ళు, చిరుతలు కూడా వుంటాయి. ఈ ప్రాంతంలో కల మొక్కలు ఔషధ గుణాలు కలిగి వుంటాయి. హిమాలయన్ బేర్, హిమాలయన్ గోఅట్, పాంథర్ వంటి జంతువులును చూడవచ్చు.డెహ్రాడూన్, ముస్సోరీ నగరాల నుండి సంక్చురికి బస్సులు టాక్సీ లు దొరుకుతాయి.