వినాయకుడికి అంకితమివ్వబదిన ప్రసిద్దమైన ఆలయం గణేష్ ధామ్. 35 అడుగుల ఎత్తున్న భారీ విగ్రహం ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఇద్దరు స్థానిక ప్రముఖ వ్యక్తులచేత ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడింది. గణేష్ ధామ్ కి సహజ సిద్దమైన అందాలని అందించేటట్టుగా రెండు నదీ ప్రవాహాలు ఉంటాయి. ఈ ఆలయంలో హనుమంతుల వారి భారీ విగ్రహాన్ని కూడా గమనించవచ్చు.