నదౌన్ బ్రిడ్జి, బియాస్ నది పై కట్టిన ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. ఈ బ్రిడ్జి నుండి సూర్యాస్తమయ సమయాన నది ఆకర్షణీయ దృశ్యాలను తిలకించవచ్చు. ఈ బ్రిడ్జి హమీర్పూర్ జిల్లాను కాంగ్రా జిల్లా నుండి విడదీస్తుంది. చిన్న చెక్క బోట్లను ఇప్పటికి రవాణా కోసం వాడుతుంటారు, పర్యాటకులు కూడా ఈ బోట్ల ను నదిలో ప్రయాణానికి ఉపయోగించవచ్చు.