దౌలా ఖాన్ నుండి గిర్ నగర్ సుమారు 5 కి. మీ.ల దూరం లో వుంటుంది. దీనికి ఈ పేరు ఇక్కడ కల గిరి నది నుండి వచ్చింది. గిరి నగర్ లో ఒక పవర్ హౌస్ కలదు. ఇది 60 మెగా వాట్ల విద్యుత్ ఇస్తుంది. ఈ పవర్ హౌస్ గిరి నది ప్రవాహంలో సుమారు 6 కి. మీ.ల సొరంగం చేసి నిర్మించారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాక ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయబడుతుంది.