ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటాల్ లో ఒక ప్రధాన ఆకర్షణ. ఈసంస్థ మనోర సిఖరంపై నైనిటాల్ కు 9 కి.మీ.ల దూరంలో కలదు. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కల వారికి ముందస్తు అనుమతులతో వారి టెలీస్కోప్ లలో గ్రహాలను, నక్షత్రాలను పరిశీలించే అవకాసం ఇస్తుంది. ఈ సంస్థ ను 1955 లో స్థాపించారు. 1961 లో ఈ ప్రదేశానికి బదిలీ చేసారు. వివిధ ఖగోళ అంశాలపై ఈసంస్థ పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ ఉపగ్రహాలను నియంత్రించే పని చేస్తోంది.