గుర్నీ హౌస్ అనేది ఒక బ్రిటిష్ హంటర్ మరియు పర్యావరణ సంరక్షుడు అయిన జిమ్ కార్బెట్ నివాసం. అందమైన ఈ నివాసాన్ని ఆయన శారద ప్రసాద్ వర్మ కు విక్రయించారు. ప్రస్తుతం ఇది నిరంజన్ దాల్మియా మనుమరాలు అధీనంలో కలదు. ఈ హెరిటేజ్ భవనం చూసేందుకు యజమానులు పర్యాటకులను ముందస్తు అనుమతులతో ఆహ్వానిస్తారు. కార్బెట్ కు సంబంధించిన ఎన్నో వస్తువులను ఇక్కడ చూడవచ్చు.