తట్టపాని, నల్దేరా నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. సముద్ర మట్టానికి 655 మీటర్ల ఎగువన ఉన్న ఈ ప్రాంతం గంధకపు వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. ఈ బుగ్గ నీళ్ళల్లో ఒక మునక వేస్తే నీరసం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు వంటివి నయమౌతాయని విశ్వసిస్తారు. సట్లేజ్ నది ఒడ్డున ఉన్న ఈ నీటిబుగ్గ దాదాపు ఒక చదరపు కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది.
ఇక్కడికి వచ్చాక, పర్యాటకులు సట్లేజ్ నది వెంబడి రివర్ రాఫ్టింగ్ కూడా చేయవచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్ నెలలలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ నీటి బుగ్గ ప్రత్యేక లక్షణం, ఇది ప్రతి ఏటా జూన్ లేదా జూలై నెలలలో కొంత కాలం మాయమై, తిరిగి నవంబర్, డిసెంబర్ నెలలలో ప్రత్యక్షమౌతుంది.