సముద్ర మట్టానికి 3550 మీటర్ల ఎత్తులో ఉన్న జలోరి కనుమ, హిమాచల్ ప్రదేశ్ లోని నరకంద వద్ద ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. నరకంద నుండి 90 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ కనుమను చేరటానికి, సందర్శకులు, సట్లెజ్ లోయ ద్వారా, కులు లోయ యొక్క లూరి,అని మరియు ఖనగ్ ల అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తారు. కనుమకు సమీపంలో, పచ్చ పచ్చని అడవుల నడుమ ఉన్న సరోల్సర్ సరస్సు, 30 నిమిషాల తేలిక నడకతో చేరుకోవచ్చు.
బంజర్ లోయ యొక్క ప్రముఖ ఆరాధన స్థలం, శ్రుంగ రిషి ఆలయం, కనుమ సమీపంలోనే ఉంది. కథానుసారం, అడవి లో ఉన్న "పిండి" అని పిలివబడే ఒక పవిత్ర రాయి, ఆలయంలో సంస్థాపనకు ఆ దారిన పోయే ప్రతి బాటసారికి విజ్ఞప్తి చేస్తుంది.
ఈ కనుమ, కులు లోయను రాంపూర్, సిమ్లా మరియు కిన్నార్ లతో కలుపుతుంది. సందర్శకులు, రాష్ట్రంలోనే ఉత్తమ పర్వత బైకింగ్ అనుభవాన్ని అందించే కనుమ ద్వారా సిమ్లా నుండి మనాలి ప్రయాణించవచ్చు.