అడ్యన్ పర జలపాతం, పెద్ద సంఖ్యలో సందర్శకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే కుర్మబాల౦గోడ్ గ్రామంలోని ఒక అద్భుతమైన జలపాతం. ఇది నిలంబూర్ పట్టణం నుండి 12కిలోమీటర్ల దూరంలో ఉంది, నిలంబూర్ – ఊటీ జాతీయ రహదారి ద్వార ఇక్కడకు చేరవచ్చు.అడ్యన్ పర జలపాతం సుందర పరిసరాలు, పచ్చదనం, ఇది కిందకు ప్రవహించే బ్రహ్మాండమైన రాళ్ళకు ఎంతో ప్రసిద్ది. ఈ రాళ్ల మధ్య నుండి కిందకు పారిన తర్వాత ఈ జలపాతం సందర్శకులను ఆకర్షించే ఒక చిన్న సెలయేరుగా మారుతుంది. జలపాతం ప్రసిద్ధ వెల్లరిమల పర్వత శ్రేణులలో పుట్టి కిలోమీటర్ల కొద్ది రాళ్లు, దట్టమైన అడవులలో ప్రవహించిన తర్వాత చలియార్ నది లో కలుస్తుంది. అడ్యన్ పర జలపాతం అడుగుల ఎత్తులో ఎప్పటికి ఎండిపోకుండా ప్రవహించే కాలువలతో ఆశిర్వదించ బడింది. పరిసరాలలో సతత హరితారణ్యాలు ఉన్న ఈ జలపాతం అందమైన దృశ్యాలతో ఒక రోజు పర్యటనకు, కుటుంబ విహార యాత్రకు సరైన ప్రదేశం