కేరళ – తమిళనాడు సరిహద్దులలోని ఎలంబలై కొండలు, ప్రకృతి ప్రేమికులు, వన్య ప్రాణి ఔత్సాహికులకు ఒక ప్రముఖ గమ్యస్థాన౦. నిలంబూర్ కు దగ్గరగా ఉన్న ఈ కొండ కు రోడ్డు ద్వార చేరవచ్చు.ఎలం బలై కొండలు చలియార్ నది పుట్టే ప్రాంతంగా ప్రసిద్ది. దట్టమైన అటవీ భూములు, మంత్రముగ్ధుల్ని చేసే వెదురు తోటలు ఈ కొండల్ని చుట్టి వాస్తవ దృశ్యాలతో కనువిందు చేస్తాయి.విస్తృత శ్రేణిలో ఏనుగులు, జింకలు, నీలి కోతులు, దున్నలు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు, కుక్కలు ఉన్న ఈ ప్రాంతం వన్యప్రాణి ప్రేమికులకు ఒక ఉత్తమ స్థానం. అందమైన దృశ్యాలు, పచ్చదనపు తీవాచీలతో ఎలంబలై కొండ ఫోటోగ్రాఫర్లను, ఇక్కడ ఉండాలనుకొనే వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది కుటుంబ విహార యాత్రకు, విరామసమయపు యాత్రలకు రావడానికి ఒక ఉత్తమ ప్రాంతం