ఐ.ఆర్.పీ.పీ.యెల్. వారిచే నిర్మించబడిన ఈ గ్రేట్ ఇండియా ప్లేస్ దేశంలో కెల్ల అతి పెద్ద షాపింగ్ మాల్. 1,39,00 చదరపు మీటర్ల వైశాల్యంగల షాపింగ్ మాల్ నోయిడా సెక్టర్ 18లో ఉన్న వరల్డ్స్ ఆఫ్ వండర్ లో ఒక భాగం. ఈ షాపింగ్ మాల్ లో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన బ్రాండ్లయిన గ్లోబస్,పంటలూన్స్ ,బిగ్
బజార్,హోం టవున్,వుడ్ల్యాండ్,లైఫ్ స్టయిల్,లైఫ్ స్టయిల్ హోం,అది డాస్,గెస్, నైకీ,మార్క్స్ అండ్ స్పెన్సర్ లాంటి అనేక సంస్థలు తమ దుకాణాలని ఈ మాల్ లో ఏర్పాటు చేసుకున్నాయి.ఈ మాల్ ని వివిధ విభాగాలు లేదా జోన్ల గా విభజించారు. ఈ విభాగాలు వివిధ అంతస్తులలో ఉన్నాయి. ఉదాహరణకి గ్రుహోపకరణాలు,కిరాణా వస్తువుల వంటి ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక అంతస్తులో,ఆడ మగవారి బట్టలు బేస్మెంట్ లో వుంటాయి.
ఈ మాల్ లో పై అంతస్తులో ఆరు స్క్రీన్ లు గల మల్టీ ప్లెక్స్ ఉంది. దీనిలో ఒకేసారి 1220 మంది వీక్షకులు సినిమా వీక్షించవచ్చు. ఇంకా వివాహాది శుభ్యకార్యాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడీన వెడ్డీంగ్ జోన్ 850 చదరపు అడుగులలో విస్తరించి ఉంది. ఇంటి అలంకరణకి కావాల్సిన వస్తువులన్నీ "హోం సజ్" పేరుతో ఇంకొక చోట కొలువు తీరాయి.
గ్రేట్ ఇండియా ప్లేస్ నోఇడా లో అత్యంత జన సమ్మర్ద మైన షాపింగ్ కేంద్రం.