Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పురాతన గోవా » వాతావరణం

పురాతన గోవా వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం గోవా సందర్శనకు అక్టోబర్ నుండి డిసెంబర్ చివరి వరకు అనుకూలమే. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువ. నూతన సంవత్సర సమయంలో కొద్దిపాటి వేడి ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలనుండి పర్యాటకులు గోవా చేరి ఆనందిస్తారు.

వేసవి

వేసవి గోవాలో వేసవి మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలనుండి 39 డిగ్రీ సెల్షియస్ వరకు మారుతూంటాయి. అయితే రాత్రులందు 28 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది. మే నెల అధిక ఉష్ణోగ్రత. ఎండ వేడిమికి సన్ టాన్ లోషన్ ఉపయోగించాల్సిందే.   

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం బీచ్ లను అధికంగా ఉపయోగించలేము కనుక, మీరు కనుక ఈ ప్రదేశం అంతర్భాగాలలోకి ఈ సమయంలో వెళ్ళగలిగితే అనేక జలపాతాలు, ప్రవాహాలు కనపడతాయి. ఈ సమయంలో సముద్ర స్ధాయి కూడా పెరిగి పెద్ద పెద్ద అలలు వేగంగా వస్తూ అందంగా కనపడుతుంది. వర్షాకాల ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలనుండి 28 డిగ్రీ సెల్షియస్ వరకు ఉంటాయి. రాత్రులు మరింత చల్లగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో గోవా లోపలి ప్రదేశాలు మరింత చల్లగా ఉంటాయి. 16 డిగ్రీల నుండి 18 డిగ్రీలవరకు కూడా ఉష్ణోగ్రత పడిపోతుంది. అయితే, బీచ్ ప్రదేశాలు హాయిగా సౌకర్యంగా ఉంటాయి. కొద్దిపాటి ఎండతో బీచ్ లలో ఆనందించవచ్చు.