మకర పొంగల్ పండుగను తమిళ్ నాడు అన్ని ప్రాంతాలలోను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ సాధారణంగా జనవరి మధ్యలో 12 నుండి 15 తేదీలలో వస్తుంది. ఈ సమయం పంటలు చేతికి వచ్చే సమయం. కనుక ఈ పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ చేస్తే సంపద పొందుతారు అని అంటారు. ఊటీ లో ఈ పండుగను సూర్యుడికి, వరుణ దేవుడికి చక్కని పంటలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా జరుపుతారు. పశువులను కూడా ఈ సమయంలో పూజిస్తారు. హిందువులు వారి వారి ఇండ్లను పూవులతో, ముగ్గులతో అలంకరిస్తారు. పాలు, బియ్యం, షుగర్ వేసి ఉడికించి పొంగలి అనే ఒక ప్రత్యేక తీపి వంటకాన్ని చేసి అందరూ తింటారు.