పంచామారి లోని క్రీస్ట్ చర్చి ని బ్రిటిష్ వారు 1875 లో నిర్మించారు. దీని నిర్మాణంలో బ్రిటిష్, ఐరిష్, ఫ్రెంచ్ శిల్ప శైలి కనపడుతుంది. ఈ చర్చి అద్దాలను బెల్జియం నుండి తెప్పించారు. ఈ చర్చి అందాలను చూసేందుకు అనేకమంది సంవత్సరం పొడవునా ఇక్కడకు వస్తూనే వుంటారు. భక్తులు ప్రార్థనలే కాక పర్యాటకులు కూడా వచ్చి దీని అందాలను తనివి తీరా ఆనందిస్తారు.