Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పహల్గాం

ఫహల్గామ్ - మొఘల్ రాజ దర్పం...!

51

ఫహల్గామ్ జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో, అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే, ప్రాచీన కాలంలోని మొఘల్ రాజుల పాలనకు వెళ్ళాలి. అప్పుడు ఇది ఒక కుగ్రామం. సంప్రదాయం యొక్క ఠీవి,గొప్పదనం వీరి యొక్క వస్త్రధారణ,ఆహారం మరియు వీరి జీవనవిధానంలో ప్రతిబింబిస్తుంది. వీరు హిందీ భాషతోపాటు, ఉర్దూ,కాశ్మీర్ మరియు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు.

ప్రకృతి సిద్ధంగా, ఇది 2740మీ. ఎత్తులో ఉండి మరియు శ్రీనగర్ కు 95 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్థలం దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన ప్రవాహాలు, మరియు పువ్వుల పచ్చిక బయళ్లలతో నిండి ఉంటుంది. ఈ స్థలం యొక్క ప్రక్రుతి సౌందర్యాలలో ఒకటి ఆరు మరియు శేషసర్పం రెండు నదులు కలిసే స్థలం.

కొన్ని ఆకర్షణలు

తరువాత శేషసర్పం హిమాలయాల మీద హిమానీనదాలు ఏర్పరుస్తుంది మరియు ఆరు నది అయితే ఖోలహోఇ హిమానీనదం లో విలీనం అవుతుంది. ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ యాత్ర, ఒక ముఖ్యమైన హిందూమత పుణ్యక్షేత్రం, ఫహల్గామ్ నుండి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడనుండి మరొక 3 రోజులు పూర్తి చేయడానికి పడుతుంది.

పర్యాటకులు ఫహల్గామ్ ను ఆధారం చేసుకొని చందివర్, ఆరు లోయ, మరియు కోహ్లి హిమానీనదానికి వెళుతుంటారు. ఇక్కడ నుండి లెహ్ ప్రదేశానికి కూడా వెళ్ళవొచ్చు. జీప్ సఫారీలు కూడా ఇక్కడ నుండి అందుబాటులో ఉంటాయి. మట్టన్, తార్సార్ సరస్సు, షికార్గ, సన్ టెంపుల్, ఐశ్ముకమ్,లిద్దేర్వాట్ మరియు మామలేశ్వర్ టెంపుల్ అనే ముఖ్యమైన సందర్శన ప్రదేశాలను ఫహల్గామ్లో చూడవొచ్చు. బైసరన్, ఇది ఫహల్గామ్ కు 5 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది దట్టమైన అడవులు, పచ్చని బయళ్ళు మరియు మంచుతో కప్పబడిన కొండలతో కన్నులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫహల్గామ్కు 16 కి. మీ. దూరంలో మరియు 3353 మీ. ఎట్టు నుండి తులియన్ అనే సరస్సు ఉన్నది. ఇది ఒక పర్యాటక సందర్శన ప్రదేశం. ఈ స్థలాన్ని దర్శించాలంటే ఒక పొట్టి గుర్రాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది.

దీనికి తోడు, సముద్ర మట్టానికి 2923 ఎత్తులో 'చందన్ వారి' అనే పేరు కల పర్యాటక స్థలం సమీపంలో ఉన్నది. ఈ ప్రదేశంలో కల 'స్నో బ్రిడ్జి' చూపరులకు కనువిందు చేస్తుంది. ఫహల్గామ్కు 40 కి. మీ. దూరంలో 'పంచతర్ని' అనే సందర్శనా స్థలం ఉన్నది. 5 చిన్న సెలయేళ్ల సంగమం వొద్ద ఈ స్థలం ఉన్నది. హిందువుల పవిత్ర స్థలం,అమర్నాథ్ యాత్రలో ఇది చివరి నిలుపుదల ప్రదేశము.

ఈ స్థలం ఒక వసతి స్థలంగా పేరు పొందింది మరియు ఇది అమర్నాథ్ నుండి కేవలం 6 కి. మీ. దూరంలో ఉన్నది. ఇంకా, సమీపంలోనే 'బారాముల్ల' జిల్లా, జమ్మూ మరియు కాశ్మీర్ ఉన్నది.

ఈ ప్రదేశం ప్రక్రుతి సౌందర్యానికి ఆటపట్టు,కాబట్టి ఇక్కడ సినిమా షూటింగ్సు చాల జరుగుతుంటాయి.సంవత్సరం అంతా పర్యాటకులు దేశవిదేశాలనుండి ఈ ప్రాంతాన్ని దర్శించటానికి వొస్తూనే ఉంటారు.

వాతావరణ పరిస్థితులు

ఇక్కడ ప్రతి రుతువులోను వాతావరణం చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు వాతావరణం చాల సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా మంచు పడటం చూడాలనుకుంటే, ఆ అనుభవాన్ని ఆస్వాదించాలంటే నవంబర్ మరియు ఫెబ్రవరి నెలల్లో సందర్శించవొచ్చు జూలై మరియు ఆగష్టు నెలల్లో అమర్నాథ్ దర్శించటానికి చాలామంది భక్తులను చూడవొచ్చు. ఏది ఏమైనా,ఏప్రిల్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు ఫహల్గామ్ ను దర్శించటానికి అనువైన సమయం.

పర్యాటకులు పహల్గామ్ నుండి వెనక్కి వెళ్ళేప్పుడు అక్కడ దొరికే స్థానిక చేనేత పనులతో ఉన్న కార్పెట్లు, షాల్స్ మరియు అక్కడి సాంప్రదాయక దుస్తులు కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు.

పహల్గాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పహల్గాం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పహల్గాం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పహల్గాం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా పహల్గామ్ నగరం ఢిల్లీ నుండి 828 కి. మీ. మరియు శ్రీనగర్ నుండి 95 కి. మీ. దూరంలో ఉన్నది. యాత్రికులు NH 1A ద్వారా కాశ్మీర్ లోయను చేరుకోవొచ్చు.రాష్ట్ర సొంత బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు శ్రీనగర్ నుండి సులభంగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా పహల్గామ్ కు రైల్వే స్టేషన్ లేదు. దీనికి 90 కి. మీ. దూరంలో శ్రీనగర్ స్టేషన్ ఉన్నది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుండి టాక్సీలు లేక బస్సులు కాని కనీస ఖర్చుతో దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానం ద్వారా పహల్గాం నుండి 95 కి. మీ. దూరంలో శ్రీనగర్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం పెద్ద పెద్ద నగరాలైన ముంబై, జమ్ములతో జత చేయబడిన ఢిల్లీకి అనుసంధానం చేయబడింది. విమానాశ్రయం నుండి పహల్గామ్కు టాక్సీలు లేదా బస్సులు మాట్లాడుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri