చందన్వారి సముద్ర మట్టానికి 2923 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పహల్గామ్ నుండి 16 కి. మీ.దూరంలో ఉన్నది. ఇక్కడి ఉత్కంఠ కలిగించే ప్రక్రుతి సౌందర్య దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఇతర ఆకర్షణలు మంచుతో కప్పబడిన వంతెన మరియు హిమానీనదాలు సమీపంలో ఉన్నాయి.అమర్నాథ్, హిందువుల పుణ్య, పవిత్ర స్థలానికి వెళ్ళే దారిలో చందన్వారి ఒకటి. యాత్రికులు పహల్గామ్ నుండి చందన్వారికి ఒక చదునైన భూభాగం గుండా డ్రైవింగ్ ద్వారా చేరుకుంటారు. పహల్గామ్ నుండి చందన్వారికి మినీ బస్సులు కూడా ఉన్నాయి.