పాన్గోంగ్ సరస్సు సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. దీనినే పాన్గోంగ్ త్సో అని కూడా అంటారు. దీని పొడవు 134 కి.మీ. మరియు వెడల్పు 5 కి. మీ. యాత్రికులు దీనిని దర్శించటానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న గ్రీన్ వాలీ మరియు తిక్సీ విలేజ్ ను కూడా చూడవొచ్చు. తిక్సీ విలేజ్ వెళ్ళే దారిలో పురాతన కాలం నాటి స్తూపాలను చాల చూడవొచ్చు. పక్షులను ప్రేమించేవారు ఈ సరస్సు దగ్గర వేచి వుంటే, పొడుగు తల కల పెద్ద బాతులు, సైబీరియన్ కొంగలు మరియు జలపక్షులు ఇలా అనేక రకాల విహంగ పక్షులను చూడవొచ్చు. శీతాకాలంలో ఈ సరస్సు ఉప్పగా గడ్డ కడుతుంది.
లెహ్ నుండి 5 గంటలు సమయం పడుతుంది, ఈ స్థలం చూడటానికి ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ పొందుతేనే సాధ్యపడుతుంది ఎందుకంటే ఇది సైనో-ఇండియన్ లైన్ ఆఫ్ అక్యుచువల్ కంట్రోల్ క్రింద ఉన్నది. ఇండియన్ నేషనల్ అయితే, ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా పర్మిట్ తీసుకోవాలి, వేరేవాళ్ళు అయితే, గ్రూప్ పర్మిట్ తీసుకోవాలి. ఒక్కో గ్రూప్ లో కనీసం ముగ్గురు ఉండాలి. వీరు తప్పనిసరిగా ఒక అధికార గైడ్ తో కలిసి ఉండాలి. ఈ పెర్మిట్ల కోసం లెహ్ టూరిస్ట్ ఆఫీసు కనీస చార్జ్ వసూల్ చేస్తున్నది. ఇక్కడ భద్రతా కారణాల వాళ్ళ ఈ సరస్సులో బోటింగ్ కు అనుమతి లేదు.