పెరుంతేనరూవి జలపాతాలు ఎంతో అందమైనవి. ఈ ప్రదేశం పాతానం తిట్ట నుండి 36 కి.మీ.ల దూరం కలదు. ఈ జలపాతాలు చివరకు పంబా నదిలో కలిసిపోతాయి. జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తునుండి ఒక లోయలోకి పడి అద్భుతంగా కనపడతాయి. అందమైన పరిసరాలు, జలపాతం ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక స్ధలంగా చేశాయి. వినోద విహారాలు తరచుగా జరుగుతూంటాయి. పెరుంతేనారువి అంటే తేనె యొక్క ప్రవాహం అని అర్ధం చెపుతారు. పేరుకి తగినట్లే ఈ జలపాతాలు, దేశ, విదేశాల పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. జలపాతాల ఎత్తు అసాధారణ్ం కాదు కానీ అక్కడి అందాలు ఆ ప్రదేశాన్ని ప్రిసిద్ధి కెక్కేలా చేశాయి.