చేపల వేట, పౌరీ సందర్శకులు నాయర్ నదిలో పొందే వినోద కార్యకలాపాలలో ఒకటి. నదిలో ఈత కూడా కొట్టవచ్చు. నాయర్ లోయ ప్రకృతి సౌందర్యంతో మనోహరంగా ఉంటుంది. సత్పులి ప్రాంతం కూడా చేపల వేట మరియు ఈతకు పేరు గాంచింది. గ్రామీణ పర్యాటక ప్రదేశంగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసే మంచి అవకాశం ఉంది. ఇక్కడ సందర్శకులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ వసతి సౌకర్యాలు ఉన్నాయి.