కేరళ రాష్ట్రంలో పయ్యోలి బీచ్ ప్రసిద్ధి చెందినది. ఇక్కడకల ప్రశాంత వాతావరణం దీనిని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా చేసింది. లోతులేని జలాలు స్విమ్మింగ్ మరియు నీటి క్రీడలకు అనుకూలం. ఇక్కడ మీకు దొరికే ఆహారాలు, విక్రయదారుల మర్యాదలు ఈ ప్రదేశాన్ని మీకు ఎప్పటికి గుర్తుండేలా చేస్తాయి.
ఈ బీచ్ చేరాలంటే, సముద్రం ద్వారా 14 కి.మీ.ల దూరంలో చేరవచ్చు. ఈ తీరం అనేక కనుమరుగయ్యే ఆలివ్ రిడ్లీ తాబేళ్ళకు ప్రసిద్ధి చెందింది. నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో వందలాది తాబేళ్ళు తీరానికి వచ్చి గుడ్లను పెడతాయి. ఈ సుందర దృశ్యాలు మీరు జీవితకాలంలో మరచిపోలేనివిగా ఉంటాయి. ఈ ప్రదేశం వాటికి ఒక అభయారణ్యం వలే వుంటుంది. అతి సుందరర పరిసరాలలో జీవం మరో మారు ఏ సమస్య లేకుండా పునరుజ్జీవనం పొందిందా అనేది మీరు ప్రత్యక్షంగా పరిశీలించి ఆనందించవచ్చు. ఇక్కడ లభించే ఆహారాలు ఒక ఆకర్షణ అయితే, వారి ఆతిధ్యం మరొక ఆకర్షణ. ప్రసిద్ధి గాంచిన పయ్యోలి చికెన్ ఫ్రై ఆహారం మీ నోటిలో ఊటలు తెప్పిస్తుంది. చికెన్ ఫ్రై తో మొదలు పెట్టి ఎన్నో రకాలు తినేస్తారు. ఈ బీచ్ ఒక అతి పెద్ద రాతి ప్రదేశం. దీనిని వెల్లియంకల్లు అని అంటారు. పురాతన కాలంలో నావికులకు ఈ ప్రదేశం ఒక పీడకలగా ఉండేది. తర్వాతికాలంలో ఇక్కడ ఒక లైట్ హౌస్ నిర్మించి వారికి సుగమం చేశారు. రాతిపై కల సహజ చెక్కడాలు చూడదగినవి, రాతి వద్దకు వెళ్ళేందుకు మీకు బోట్ సర్వీసులు లభ్యంగా ఉంటాయి. ఈ రాతి వద్దకు అనేక పక్షులు వచ్చి సేద తీరుతూంటాయి.