పితోర్ ఘర్ పట్టణానికి 80 కి.మీ.ల దూరం లో కల జౌళ్ జిబి ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈప్రదేశంలో రెండు నదులు కలుస్తాయి. అవి గోరి మరియు కాళి నదులు. ఇక్కడప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి గొప్ప ఉత్సవం జరుపు తారు. ఈ జాతర వేడుక ఈ ప్రాంతంలో మొదటి సారిగా 1914 నవంబర్ లో నిర్వహించారు. జౌళ్ జిబి నుండి పడి కి.మీ.ల దూరంలో కాలాపానీ హిల్ అనే మరొక టూరిస్ట్ అట్రాక్షన్ కలదు. ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ కలదు. ఈ నీటిలో ఔషధ గుణాలు కలవు. సమీపం లోని వ్యాస్ గుహ ను కూడా అనేక మంది టూరిస్టులు దర్శిస్తారు.