పాండిచేరి లోని బొటానికల్ గార్డెన్, అక్వేరియంలను సి ఎస్ పెర్రోటేట్ 1826 వ సంవత్సరంలో స్థాపించాడు. ఈ బొటానికల్ గార్డెన్లో జీవశాస్త్ర౦ చదివే విద్యార్థులు, పరిశోధకులకు ఆసక్తిని కల్గించే అసాధారణ మొక్కల సేకరణ ఉంది. ప్రధాన బస్ స్టాండ్ దక్షిణ ద్వార౦ నుండి దగ్గరగా ఉన్న ఈ గార్డెన్, అక్వేరియం 22 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది 1960 లో పాండిచేరి హార్టికల్చర్ శాఖకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ అక్వేరియం లో విస్తృత శ్రేణిలో ఉన్న సముద్ర ప్రాణులు ఈ ప్రాంతాన్ని చాల ప్రసిద్ధమైన ఒక పర్యాటక ఆకర్షణగా మార్చాయి. ఇక్కడి జల ప్రాణులను ఒకసారి ప్రత్యేక౦గా తప్పనిసరిగా చూడాలి.
ఈ గార్డెన్ లో ఒక పిల్లల రైలు, నాట్యం చేసే ఒక ఫౌంటేను, అనేక అరుదైన రకాల అలంకరణ చేపలు ఉన్న ఒక అక్వేరియం, ఆరు ఫౌంటేనులు ఉన్నాయి.