విశ్రాంతికోరి వచ్చే పిక్నిక్ ప్రియులకు గోల్డెన్ వ్యాలీ సరైన ప్రదేశం. చిన్న, చిన్న నదులు, ప్రవాహాలు చల్లని నీరు, పచ్చటి చెట్లతో ఈ వ్యాలీ పర్యాటకులకు ప్రశాంతత కలిగిస్తుంది. పొన్ముడి సందర్శించే యాత్రికులు గోల్డెన్ వ్యాలీ తప్పక చూడాలి. విస్తృతమైన ప్రకృతి అందాలు, పచ్చటి అంతులేని కాలిదోవలు పర్యాటకులను విస్మయ పరుస్తాయి.
ఈ వ్యాలీ గుండా ప్రయాణించే నది అద్భుతంగా ఉంటుంది. నదిలో సురక్షితంగా క్రీడించవచ్చు. పిల్లలు, తక్షణమే నది నీటికి ఆనందపడతారు. హనీమూన్ జంటలు లేదా కుటుంబ సభ్యులు అందరకు గోల్డెన్ వ్యాలీ అనుకూలమే. ట్రెక్కింగ్ ప్రియులు, లేదా విశ్రాంతిగా సంచరించేవారు కూడా దీనిని ఒక స్వర్గంగా భావిస్తారు.
సమీపంలో ఏ రకమైన దుకాణాలు లేవు కనుక పర్యాటకులు తమ ఆహారం, నీరు మొదలైన అవసరాలను తీసుకు వెళ్ళటం ఉత్తమం. పెద్దలకు మరొక్కసారి వారి బిజీ లైఫ్ నుండి పునరుజ్జీవనం, పిల్లలకు మరింత ఆహ్లాదం ఈ ప్రదేశం కలిగిస్తుంది.