భరతపూజ ని నీల అని కూడా అంటారు. ఇది కేరళ లో రెండవ పొడవైన నది. ఎంతో కాలంగా, ఈ నది ఉత్తర కేరళ ప్రదేశ సంస్క్రుతికలను లను ప్రతిబింబిస్తోంది. అనేక స్థానిక రచయతల రచనలలో పేరు కలిగి ఉంది. భరతపూజ మరియు తిరుర్ నదులు కలిసే ప్రదేశంలో సముద్రం కూడా కలుస్తుంది. ఈ ప్రదీశంలో పక్షి సంచారం అద్భుతంగా ఉంటుంది. వేలాది పక్షులు ఇక్కడకు వలసలు వస్తాయి. వేసవి లో ఎన్నో రకాల పక్షులు ఇక్కడ విహరిస్తూ ఉండటాన్ని తప్పక చూడాలి. 209 కి.మీ. పొడవైన ఈ నదీ తీరం కేరళకు ఎంతో సంస్కృతిని అందించింది. వేసవి లో నది ఎందిలప్పటికి రుతుపవనాలు మరోమారు దానిని నింపి దాని ఒడ్డును పచ్చగా చేసేస్తాయి. సీజన్లో ఏదైనప్పటికీ, భరతపూజ పర్యాటకులను ఆనందపరుస్తుంది.