ఇది రాయ్ పూర్ లోని పురాతన సరస్సు, బహుశా ఈ నగరం కూడా పురాతనమైనదే. దీనిని ‘పురాతన సరస్సు’ అని అర్ధం వచ్చే బుర్హా లేక్ అనికూడా పిలుస్తారు. ఇది రాయ్ పూర్ మొత్తంలో అతిపెద్ద సరస్సు. ఈ సరస్సు వద్ద 37 అడుగుల ఎత్తున్న స్వామి వివేకానంద విగ్రహం ఉంది, ఈ విగ్రహం అతిపెద్ద నమూనాగా ఉన్నందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని పొందింది.
ఈ సరస్సు నుండి షుమారు 2.7 కిలోమీటర్ల వద్ద, స్వామి వివేకానందకు అంకితం చేసిన ఒక ఆశ్రమం ఉంది, ఇక్కడ స్వామివారి ఆదర్శాల గురించి బోధిస్తారు.