Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాజమండ్రి

రాజమండ్రి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సాంస్కృతిక రాజధాని! 

25

రాజమండ్రిని ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని అంటారు.చరిత్ర ప్రకారం,ఈ నగరం లోనే గొప్ప కవి నన్నయ తెలుగు లిపిని కనుగొన్నాడు. నన్నయ "ఆదికవి", లేదా తెలుగు భాష యొక్క మొట్టమొదటి గొప్ప కవి అని గౌరవించబడ్డాడు. నన్నయ మరియు తెలుగు లిపి యొక్క జన్మ స్థలం రాజమండ్రి. రాజమండ్రికి పూర్వ నామము రాజమహేంద్రి. ఇక్కడ వేద సంస్కృతి మరియు విలువలకు కట్టుబడి ఉండుట వలన పురాతన ఆచారాలు ఇప్పటికీ పాటిస్తారు.అనేక అరుదైన కళల రూపాలు నగరంలో ఉన్నాయి. ఇది సీమాంధ్ర  లో అత్యధిక జనాభా కలిగిన  నగరం.  ఈ కార్పోరేషన్ ను ప్రభుత్వం అధికారికంగా "సంస్కృతి యొక్క గ్రాండ్ నగరం" గా నామకరణం చేసింది.రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలన జరిపాడని చరిత్రకారులు చెబుతారు.

ఇది భారతదేశం లోని పురాతన నగరాలలో ఒకటి. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్మక, సాంసృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క భాగంగా ఉంది. మరియు బ్రిటీష్ పాలనలో ,1823 సంవత్సరం లో రాజమండ్రి జిల్లాగా మార్చబడింది. స్వాతంత్ర్యం తర్వాత గోదావరి జిల్లా ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ కల గోదావరి నది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 400 కిలోమీటర్ల ఒడ్డున ఉంది. రాష్ట్రం యొక్క అధికారిక భాష తెలుగు ఇక్కడ పుట్టుట వల్ల ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ జన్మస్థలం అని అంటారు.

మొదట చాళుక్యులు నగరం యొక్క మూల స్థంబాలు గా ఉండేవారు. ఆ తర్వాత శ్రీ రాజరాజ నరేంద్రుడు దీనిని నిర్మించినట్లు భావిస్తున్నారు. ఈ నగరంను పురాతన కాలంలో రాజమహేంద్రి లేదా రాజమహేంద్రవరం అని పిలిచేవారు. రాజమండ్రి నుండి విజయవాడకు 1893 లో రైలు రోడ్డు వేయటం జరిగినది. అనేక ముఖ్యమైన విద్యా సంస్థలు అదే సమయంలో రాజమండ్రి లో ప్రారంభమైనాయి. రాజమండ్రి నగరం స్వాతంత్ర్య పోరాటంలోను, అనేక ఉద్యమాలలోను పాల్గొంది. రాజమండ్రికి చెందిన సుబ్బారావు ఇండియన్ న్యూస్ పేపర్, "హిందూ మతం" వ్యవస్థాపకులు ఆరుగురిలో ఒకరుగా ఉన్నారు.

గొప్ప సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గారు రాజమండ్రికి చెందిన వారు. ఈయన అత్యంత విప్లవాత్మక చర్యలను చేపట్టారు. రాజమండ్రి నగరంలో 1890 సంవత్సరంలో రాజమండ్రి యొక్క టౌన్ హాల్ నిర్మాణం బాధ్యతను తీసుకున్నారు. రాజమండ్రి నగరంలో లలిత కళల రంగంలో అనేక కళాకారులు జన్మించారు. నగ్నంగా చిత్రాలు చిత్రించడానికి భారతదేశం లోనే మొట్ట మొదటి కళాకారుడు దామోదర్ల రామారావు గారు. పెయింటింగ్ లో ఈయనలో ఆంధ్ర శైలి కనపడుతుంది. ప్రశంసలు మరియు చిత్రకళ లో అతను పలు ముఖ్యమైన మెళుకువలకు ఆద్యుడయ్యాడు. రాజమండ్రి చిత్రకళాశాల ఆరంభమయ్యింది, మరియు అక్కడ నుండి తన సూక్ష్మ నైపుణ్యాలను తన శిష్యులకు బోధించారు. దమోదర్ల రామారావు గ్యాలరీ సంరక్షణకు మరియు అతని రచనల ఉత్తమ ప్రదర్శన ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. రాజమండ్రి వచ్చినప్పుడు మీరు తప్పక ఈ చిత్ర కళాశాల సందర్శించవలసినది .

నగరం కూడా సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి కోసం పాటు పడుతోంది. ఆర్యభట్ట సైన్సు మ్యూజియం పేద మరియు అణగద్రొక్కబడిన వారి అభివృద్ధి లక్ష్యంతో ఉంది. రాజమండ్రి లో అనేక ఆలయాలు ఉన్నాయి. యాత్రికులు సంవత్సరం పొడుగునా వీటిని సందర్శిస్తారు. కోటిలింగాల ఆలయం మరియు శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం అటువంటి ఆలయాలకి ప్రధాన ఉదాహరణలు. గౌతమి ఘాట్, ఇస్కాన్ ఆలయం కూడా భక్తులు చూడవలసిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. రాజమండ్రి రాష్ట్ర సాంస్కృతిక రాజధాని,మరియు రైలు , రోడ్డు మార్గాల ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడింది.

రాజమండ్రి విమానాశ్రయం నుండి చెన్నై, మధురై, విజయవాడ, బెంగుళూర్, హైదరాబాద్ నగరాలకు మాత్రమే విమానసర్వీస్ లు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉంటాయి. వాతావరణం ఎక్కువ వేడి మరియు తేమతో ఉంటుంది. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుండి 48 డిగ్రీల వరకు ఉంటాయి. వేసవి సమయంలో సగటు ఉష్ణోగ్రతలు అత్యదికంగా 51 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. డిసెంబర్ మరియు జనవరి నెలలు రాజమండ్రి సందర్శించడానికి అనువైన సమయం.

 

రాజమండ్రి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాజమండ్రి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాజమండ్రి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాజమండ్రి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాజమండ్రి చెన్నై-కలకత్తాని కలిపే జాతీయ రహదారి -16 మీద ఉన్నది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉన్నది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. ఇది విశాఖపట్నం, చెన్నై, భూపాల్, గౌలియార్, జైపూర్, బెంగుళూర్, లక్నో మరియు చెన్నై అన్ని ప్రధాన నగరాలకు రోడ్లు అనుసంధానించబడింది. ఇది తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు రెండింటికీ రవాణా కేంద్రం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రాజమండ్రి రాష్ర్తరం లోని అతిపెద్ద రైల్వే స్టేషన్ లలో ఒకటి. దేశంలో అన్ని నగరాలకు అనుసంధానించబడింది. రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. రాజమండ్రి రైల్వే స్టేషన్ నిరంతరం బిజీగా ఉంటుంది. రాజమండ్రి కోలకతా, బెంగుళూర్, ముంబై, హైదరాబాద్ దేశంలోని అనేక ముఖ్యమైన నగరాలు అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం నగర శివార్లలో ఉన్న మధురపూడిలో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉన్నది. ఇది రాజమండ్రి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ మద్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు భవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా చేసింది. ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్ మరియు స్పైస్ జెట్ వారు హైదరాబాదు,చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలను నడుపుతున్నారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat