Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రామేశ్వరం

రామేశ్వరం - దేవతల యొక్క భూతల స్వర్గం

60

రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక ప్రశాంతమైన పట్టణం మరియు మంత్రముగ్ధులను చేసే పంబన్ ద్వీపం యొక్క భాగం. పట్టణం ప్రసిద్ధ పంబన్ చానెల్ ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడింది. శ్రీలంకలో మన్నార్ ద్వీపం నుండి రామేశ్వరం కేవలం 1403 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రామేశ్వరం హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది మరియు ఒక 'చార్ ధాం యాత్ర' లేదా పవిత్ర పుణ్య సమయంలో తప్పక సందర్శిస్తారు.

పురాణాల ప్రకారం, రామేశ్వరంను విష్ణువు యొక్క ఏడవ అవతారం భావిస్తారు. రాముడు లంక రాజు అయిన రావణ నుండి భార్య సీతను కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి వంతెనను నిర్మించారు. రామేశ్వరంనకు ఆ పేరు శ్రీ రాముడు కారణంగా వచ్చింది. ప్రసిద్ధ ఆలయం రామనాథస్వామి ఆలయం పట్టణం నడిబొడ్డున ఉన్నది మరియు రాముడికి అంకితం చేయబడింది.ఈ ఆలయంను ప్రతి సంవత్సరం ప్రార్థనలు నిర్వహించడం కోసం మరియు దేవుని ఆశీర్వాదం పొందడం కోసం హిందువులు లక్షల సంఖ్యలో సందర్శిస్తారు.

రామేశ్వరంలో రాముడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని నమ్ముతారు. రాముడు బ్రాహ్మణ రాజు రావణుడి ని వధించిన తరువాత పరిహారంగా అతిపెద్ద శివలింగం నిర్మించాలని భావించారు. అప్పుడు హిమాలయాల నుండి శివలింగము తీసుకురమ్మని హనుమంతుడిని కోరారు. కానీ హనుమంతుడు తిరిగి రావటానికి ఎక్కువ సమయం పట్టింది. అందువల్ల సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుక లింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేసాడు. ఇప్పటికి ఈ లింగం రామనాథస్వామి ఆలయంలో చూడవచ్చు.

రామేశ్వరం యొక్క చారిత్రిక ప్రాముఖ్యత

రామేశ్వరం ఇతర దేశాలతో వాణిజ్యం సంబంధించి ముఖ్యంగా భారతదేశం యొక్క చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ద్వీపం శ్రీలంక అప్పటి సిలోన్ ప్రయాణం వారికి ఒక స్టాప్ గ్యాప్ అయింది. నిజానికి, జాఫ్నా సామ్రాజ్యం పట్టణం యొక్క నియంత్రణను మరియు జాఫ్నా రాజ వంశం వారే సేతుకవలన్ లేదా రామేశ్వరంను సంరక్షించారని చెప్పవచ్చు.

ఢిల్లీలో ఖిల్జీ కుటుంబం కూడా రామేశ్వరం చరిత్రతో ముడిపడి ఉంటుంది. జనరల్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యం పట్టణంనకు వచ్చింది, అప్పుడు పాండ్య రాజుల సైన్యం వారిని ఆపింది. తన రాక గుర్తుగా, జనరల్ అల్లావుద్దీన్ ఖిల్జీ రామేశ్వరంలో మసీదును నిర్మించాడు. 16 వ శతాబ్దంలో, పట్టణం విజయనగర రాజుల నియంత్రణలో వచ్చింది మరియు 1795 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రామేశ్వరంను తమ అధీనంలోకి తీసుకున్నారు. చాలా సంస్కృతులు రావడంతో ఇప్పటికీ స్థానిక జనాభా రోజువారీ సంప్రదాయాలు అలాగే భవనాల నిర్మాణం రామేశ్వరంలో చూడవచ్చు.

దేవాలయాలు మరియు తీర్దాలు రామేశ్వరం యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఈ పట్టణం శివుడు మరియు విష్ణువు అంకితం చేయబడింది. ఎందుకంటే రామేశ్వరం చుట్టూ ఉన్న అసంఖ్యాక తీర్దాలు మరియు అసంఖ్యాక దేవాలయాలు ఉండటమే దీనికి కారణము. ప్రతి సంవత్సరం హిందువులు ప్రపంచంలోని అన్ని ప్రాంతముల నుండి మోక్షం పొందడానికి ఈ పవిత్ర స్థలంను సందర్శిస్తారు. హిందువులు రామేశ్వరం ఆలయంలో కనీసం తమ జీవితంలో ఒక్క సారైనా నమస్కారం చేయాలని అనుకుంటారు.

రామేశ్వరంలో సుమారు 64 తీర్దాలు లేదా పవిత్ర నీటి వనరులు ఉన్నాయి. వీటిలో 24 ప్రాముఖ్యత గలవి అని భావిస్తారు, మరియు ఇది పాపాలను తొలగించటానికి సహాయపడుతుంది అని నమ్ముతారు. ఈ నీటి లో స్నానం తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చేయుట వల్ల వారి పాపములు పోయి మోక్షం కలుగుతుందని భావిస్తారు. నిజానికి, ఇరవై నాలుగు తీర్దాలలో స్నానం చేయటం ఒక తపస్సు గా భావిస్తారు.

రామేశ్వరంలో హిందువులకు మత ప్రాముఖ్యత కలిగిన అనేక స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని శ్రీ రామనాథస్వామి ఆలయం, ఇరవై నాలుగు ఆలయం తీర్దాలు,కోతందరమార్ ఉన్నాయి.

ఈ ఆలయం దగ్గర ఆడమ్ యొక్క బ్రిడ్జ్ లేదా రామ్ సేతు మరియు నంబు నయగి అమ్మవారి ఆలయం ఉన్నాయి. రామేశ్వరం కు బాగా అనుసంధానం చెయ్యబడిన రైల్వే స్టేషన్ అలాగే రోడ్లు నుంచి మంచి నెట్వర్క్ ఉంది. నగరానికి సమీపంలోని విమానాశ్రయం మధురై వద్ద ఉంది. రామేశ్వరం వేడితో కూడిన వేసవికాలాలు మరియు ఆహ్లాదకరమైన చలికాలాలు కలిగి ఉంటుంది.

రామేశ్వరం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రామేశ్వరం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రామేశ్వరం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రామేశ్వరం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రామేశ్వరం రోడ్డు ద్వారా చెన్నై తో అనుసంధానించబడి ఉంది. టాక్సీలు మరియు బస్సులు చెన్నై నుండి ప్రతి రోజూ రామేశ్వరంకు నడపబడుతున్నాయి. మీరు విలాసవంతమైన వోల్వో బస్సులు అలాగే రాష్ట్ర బస్సుల నుండి రామేశ్వరం చేరుకోవచ్చు. రాష్ట్ర బస్సుల చార్జీలు 100-150 రూపాయల వరకు, వోల్వో బస్సులు ఛార్జ్ 500 రూపాయల వరకు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దక్షిణ రైల్వే లోని చెన్నై రైల్వే స్టేషన్ కూడా ఒక బలమైన నెట్వర్క్ ద్వారా ఇతర నగరాలు కు అనుసంధానించబడి ఉంది. చెన్నై నుండి రామేశ్వరం వరకు నాలుగు రైళ్లు ఉన్నాయి. ఈ నాలుగు రైళ్లలో రెండు ప్రతి రోజు ఉంటాయి. మిగత రెండు ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఉంటాయి. మీ రామేశ్వరం టిక్కెట్లు ముందుగానే బుక్ చేయడం సౌకర్యం గా వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం మధురై వద్ద విమానాశ్రయం రామేశ్వరంనకు దగ్గరగా ఉన్న విమానాశ్రయం. మధురై విమానాశ్రయంచెన్నై విమానాశ్రయానికి బాగా అనుసంధానించబడింది, మరియు క్రమ అంతరాలలో మధురై మరియు చెన్నై మధ్య రోజూ విమానాలు నడుస్తాయి. మీరు రామేశ్వరం చేరుకోవటానికి మధురై లేదా చెన్నై విమానాశ్రయం నుండి టాక్సీలకు రూ.3500 ల నుంచి రూ. 5000 మధ్య చార్జి ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri