హిర్ని జలపాతాలు రాంచి కి 80 కి. మీ. ల దూరం లో కలవు. ఇవి చాలా అందమైన పరిసరాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కొండపైకి ఎక్కి, లేదా పరిసరాలలో ఆనందించ వచ్చు. కొండపై గల వాచ్ టవర్ నుండి ప్రకృతి దృశ్యాలు మరింత అందంగా వుంటాయి. ఈ జలపాతాలు రాం ఘర్ రివర్ నుండి ప్రవహిస్తాయి. సుమారు 37 మీటర్ల ఎత్తు నుండి కింద పడతాయి. వీటి పరిసరాలు దట్టమైన అడవులు కలిగి వుంటాయి.