Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాణిఖెట్

రాణిఖెట్ - 'క్వీన్స్ మేడో' !

26

రాణిఖెట్ ను ఎక్కువగా 'క్వీన్స్ మేడో' అని పిలుస్తారు. ఇది అల్మోరా నగరంలో ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఒక జానపద కధ ప్రకారం,కుమవోన్ ప్రాంతం యొక్క అందమైన రాణి పద్మిని రాణిఖెట్ సందర్శించి ఈ ప్రాంత సౌందర్యాన్ని చూసి ముగ్డురాలు అయింది. అందువలన, ఆమె భర్త రాజు సుఖేర్దేవ్ ఈ ప్రదేశంలో ప్యాలెస్ నిర్మించి మరియు దానికి 'రాణిఖెట్' అని పేరు పెట్టారు. ఈ ప్యాలెస్ గురించి పురావస్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కధలో ఉన్న రాణిఖెట్ ఇప్పటికీ సజీవంగా ఉన్నది.

బ్రిటిష్ వారు 1869 లో ఈ స్థలాన్ని తిరిగి కనుగొని మరియు దానిని వేసవి విడిదిగా మార్చారు. వారు ఇక్కడ బ్రిటిష్ కుమవోన్ రెజిమెంట్ యొక్క ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసారు. ప్రస్తుతం, వలస వారసత్వాన్ని మోస్తున్న రాణిఖెట్ భారత సైన్యం యొక్క ప్రసిద్ధ కుమవోన్ రెజిమెంట్ యొక్క ప్రధాన కార్యాలయంగా ఉంది. మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదేశంలో పచ్చని అడవులు మరియు పచ్చికభూములుతో ఒక పెద్ద పర్యాటక ప్రవాహం వలే ఉంటుంది. మైటీ హిమాలయాల మంచుతో బాగా కప్పబడిన శ్రేణులతో నిండి, ఈ పర్వత ప్రాంతం సముద్ర మట్టానికి 1869 మీటర్ల ఎత్తులో కుమవోన్ ఎగువ కొండలపై ఉంది.

అల్మోర నగరం నుండి 50 కి.మీ., నైనిటాల్ నుండి 60 కి.మీ. దూరంలో ఉన్నరాణిఖెట్ పచ్చని దేవదారు చెట్టు, ఓక్, అడవులు మధ్య విశ్రాంతి తీసుకోవడానికి చక్కని అవకాశం కలిపిస్తుంది. ప్రయాణికులు చిరుత వంటి జంతువుల వివిధ జాతులు, మొరిగే జింక, సాంబార్, చిరుత పిల్లి, కొండ మేక, భారత హరే, ఎరుపు తల కోతి, మార్టెన్, నక్క, ఎర్ర నక్క, లంగూర్, మరియు పందికొక్కు మొదలైనవి అడవులలో చూడవచ్చు. అంతే కాకుండా రాణిఖెట్ దేవాలయాలు, ట్రెక్కింగ్, మరియు సందర్శనా పాయింట్లు మరియు అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

ఝుల దేవి ఆలయం మరియు బింసర్ మహదేవ్ ఆలయం రెండు రాణిఖెట్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలుగా ఉన్నాయి. ఝుల దేవి ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో హిందూ మత దేవతైన దుర్గాదేవి కొలువై ఉన్నది. అనేక మంది యాత్రికులు దేవతకు ప్రార్థనలు చేయటానికి ఇక్కడకు వస్తారు. రాణిఖెట్ నుండి 15 కి.మీ. దూరంలో ఉన్న బింసర్ మహదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో హిందూ మత దేవుడైన శివుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ దేవదారు అడవులు మరియు ఒక సహజ నీటి బుగ్గ ఉన్నాయి.

మరొక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా కుమవోన్ రెజిమెంటల్ మ్యూజియం సెంటర్ మరియు మెమోరియల్ ఉంది. ఇది రాణిఖెట్ యొక్క సైనికులు చూపిన త్యాగం మరియు ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. 1978లో, ఈ మ్యూజియంను కుమవోన్ ప్రాంతం యొక్క వారసత్వాన్ని సంరక్షించడానికి నిర్మించారు. దేశం కోసం వారి ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల గౌరవార్ధం ఒక కవాతు నిర్వహించబడుతుంది.

మజ్హ్ఖలి రాణిఖెట్-అల్మోర రోడ్ లో ఉన్న మరొక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ప్రయాణికులు ఈ ప్రదేశం నుండి సోన్య పీక్స్ అనే ఉత్కంఠభరితమైన వ్యూ ను చూడవచ్చు. ఒక హాలిడే కోసం పర్వత భూభాగాలు,పచ్చని లోయలు, మరియు సౌకర్యవంతమైన శీతోష్ణస్థితి ఉన్న ఈ ఆదర్శవంతమైన ప్రదేశంను సందర్శించవచ్చు. ఇక్కడ మరొక ప్రదేశం ఉపట్ ఉంది, ఇది గోల్ఫ్ క్రీడాకారులకు ఒక భూతల స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ ఉన్న 9-రంధ్రం గోల్ఫ్ కోర్సు ప్రస్తుతం దేశంలోనే ఉన్న ఉత్తమ గోల్ఫ్ కోర్సులలో ఒకటి. ఈ ప్రదేశం మైటీ హిమాలయాలను మంత్రముగ్ధులను చేసే శిఖరాలతో మంచి వీక్షణలు అందిస్తుంది.

మంచి రుచికరమైన ఆపిల్, పీచ్, రేగు పండ్లు, మరియు ఆప్రికాట్లు తోటలకు ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ఈ ప్రదేశంలో నందా దేవి, నిల్కాంత్,నందఘుంటి మరియు త్రిశూల్ వంటి శిఖరాల అందమైన వీక్షణలు అందిస్తూన్న ఒక ప్రముఖ విహారస్థలం. రాణిఖెట్ సందర్సన కొరకు ప్రణాళిక వేసుకొనే పర్యాటకులు తప్పనిసరిగా రాణి ఝీల్ ను సందర్సించాలి. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు వాననీటి నిల్వ యొక్క లక్ష్యం కోసం ఒక పెద్ద కృత్రిమ సరస్సు ఉంది, దానిని సందర్శించండి. ఇది కేంద్రీయ విద్యాలయ మరియు రాణిఖెట్ యొక్క కానోస్సా కాన్వెంట్ స్కూల్ యొక్క రెండు సహజ గట్లు మధ్య ఉంటుంది. సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉన్న, సరస్సు లో ప్రయాణికులు బోటింగ్ చేయవచ్చు.

పర్యాటకులకు రాణిఖెట్ లో సదర్ బజార్ అనే ప్రధాన షాపింగ్ సెంటర్ ఉన్నది. ఇక్కడ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మార్కెట్ ప్రాంతంలో అనేక రెస్టారెంట్లు మరియు హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ సందర్శకులు భారతీయ సంప్రదాయ వస్తువులు మరియు విలక్షణమైన ఎంబ్రాయిడరీ దుస్తుల కోసం షాపింగ్ చెయ్యవచ్చు. ప్రయాణికులకు ట్వీడ్ షాల్స్, ఉన్ని చొక్కాలు, జాకెట్లు, మరియు కుర్తాలు కొనడానికి ప్రత్యేకంగా మరొక ప్రసిద్ధ మరియు తక్కువ రద్దీ మార్కెట్ ఉంది. చేతితో తయారు చేసిన ఉన్నివస్తువుల ఉత్పత్తులకు ఒక సహేతుకమైన ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చుఖుతియా రాణిఖెట్ నుండి 54 కి.మీ.దూరంలో ఉన్న మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. రాంగంగ్ నది యొక్క నిర్మలమైన ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం కుమోని అనే పదము 'చౌ -ఖట్' అనగా నాలుగు అడుగులు అని అర్దము. ఈ స్థలం యొక్క నేపథ్యంలో, నాలుగు అడుగుల నాలుగు మార్గాలు చూడండి. మొదటి మార్గం రాంనగర్, రెండో మార్గం కరణ్ ప్రయాగ,మూడో మార్గం రాణిఖెట్,నాలుగో మార్గం తడక్తాల్ లుగా ఉన్నాయి. ఖీరా అనే ఒక ప్రదేశంను కూడా ఈ నాలుగో మార్గం ద్వారా చేరుకోవచ్చు. అందువలన, ఈ ప్రదేశం మొత్తం ప్రాంతానికి సులభంగా అందుబాటులో ఉంటుంది.

మౌంటేన్ బైకింగ్ మరియు ట్రెక్కింగ్ రాణిఖెట్ లో అస్వాదించవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస క్రీడలు ఉన్నాయి. రాణిఖెట్ లో ద్వారాహట్, భలు ఆనకట్ట, తరిఖేట్, కుమవోన్ రెజిమెంట్ గోల్ఫ్ కోర్సు, కంటోన్మెంట్ ఆశియానా పార్క్, సన్సెట్ పాయింట్లు మరియు ఖూంట్ ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి. సితల్ఖేట్,జుర్ర్ర్రాసి మరియు ఖైర్ణ కూడా ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు.

రాణిఖెట్ విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర భాగాలకు అనుసంధానించబడింది. ఏడాది పొడవునా ఆధునిక వాతావరణ అనుభూతిని కలిగిస్తుంది. వేసవిలో ఈ అందమైన ప్రదేశంను అన్వేషించడానికి బాగుంటుంది. వాతావరణం ఈ సమయంలో ఆహ్లాదకరముగా ఉంటుంది. యాత్రికులు వర్షాకాలాలలో ఇక్కడ సందర్శించవచ్చు.

రాణిఖెట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాణిఖెట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాణిఖెట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాణిఖెట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాణిఖెట్ ప్రాంతంకు సమీపంలోని ప్రదేశాల నుండి నిరంతర బస్సు సేవలు ద్వారా సులభంగా చేరవచ్చు. నైనిటాల్, అల్మోర మరియు బరేఇలీ వంటి గమ్యాలు రోడ్డు ద్వారా రాణిఖెట్ సంబంధం కలిగి ఉంటాయి. తరచుగా న్యూ ఢిల్లీ నుండి రాణిఖెట్ కు ప్రభుత్వం బస్సులు నడపబడుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కత్గోడం రైల్వే స్టేషన్ రాణిఖెట్ నుండి 68 km చుట్టూ ఉన్న సమీప రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మరియు సాధారణ రైళ్ళు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కలపబడింది. ప్రీపెయిడ్ టాక్సీలు స్టేషన్ నుండి రాణిఖెట్ చేరటానికి సులభంగా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం పంత్నగర్ విమానాశ్రయం రాణిఖెట్ నుండి 100 కి.మీ. దూరంలో ఉన్న సమీప దేశీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం సాధారణ విమానాలు ద్వారా ఢిల్లీ కి అనుసంధానించబడింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రాణిఖెట్ నుండి 350 కి.మీ. దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.అంతే కాకుండా, ఈ విమానాశ్రయం దేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు కలపబడింది. ప్రీపెయిడ్ టాక్సీలు పంత్నగర్ విమానాశ్రయం నుండి రాణిఖెట్ కు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat