తారిఖేత్ రాణిఖేత్ నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామము. ఈ ప్రదేశం, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ, ఒకసారి నివసించిన చిన్న గుడిసె ' గాంధీ కుటియా' వల్ల ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఒక చిహ్నం.
ఇక్కడికి సమీపంలోని గోలు దేవతా ఆలయం కూడా సందర్శించవచ్చు. ఈ ఆలయం కుమవోన్ ప్రాంతపు పౌరాణిక మరియు చారిత్రక దైవం గోలు దేవతకు అంకితం చేయబడింది.